Numerology prediction September 17: ఈ తేదీల్లో జన్మించినవారు పనులు వాయిదా వేస్తారు, సెప్టెంబరు 17 న్యూమరాలజీ
న్యూమరాలజీలో రాడిక్స్ ఆధారంగా ఆ వ్యక్తి స్వభావం, వృత్తి, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పొచ్చు. 1 నుంచి 9 వరకూ రాడిక్స్ ఉన్న వారందరికీ సెప్టెంబరు 17న ఎలా ఉందో చూద్దాం...
Numerology prediction September 17th : న్యూమరాలజీ ప్రకారం సెప్టెంబరు 17 శనివారం ఫలితాలు తెలుసుకుందాం...
రాడిక్స్ 1 (పుట్టిన తేదీలు 1,10,19,28)
1,10,19,28 తేదీల్లో పుట్టినవారు వ్యాపారంలో లాభాలు గడిస్తారు. వీరి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఏదైనా పని విషయంలో ప్రయాణం చేయాల్సి రావొచ్చు. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి.
రాడిక్స్ 2 (పుట్టిన తేదీలు 2,11,20,29)
ఈ తేదీల్లో పుట్టినవారు భావోద్వేగానికి లోనై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆవేశం తగ్గించుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. పొట్టకు సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడతారు. పాత మిత్రులను కలుస్తారు. వ్యాపారంలో పెద్ద లాభాలు ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో కష్టమైన పనులు పూర్తి చేస్తారు.
రాడిక్స్ 3 (పుట్టిన తేదీలు 3,12,21,30)
3,12,21,30 ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. వీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించాలని నిర్ధారించుకోండి. ఆహారం విషయంలో అశ్రద్ధ వద్దు...అనారోగ్య సూచనలున్నాయి.
రాడిక్స్ 4 (పుట్టిన తేదీలు 4,13,22,31)
మీకు పాజిటివ్ ఎనర్జీ అలాగే ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపార పనుల కారణంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
Also Read: బుధుడు, సూర్యుడు ఉన్న రాశిలోనే శుక్రుడి సంచారం, ఈ 5 రాశులవారికి శుభసమయం
రాడిక్స్ 5 (పుట్టిన తేదీలు 5,14,23)
5,14,23 ఈ తేదీల్లో పుట్టినవారికి జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. కెరీర్లో ముందుకు సాగేందుకు మంచి అవకాశాలు పొందుతారు. ఉద్యోగులకు సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది.
రాడిక్స్ 6 (పుట్టిన తేదీలు 6,14,24)
ఈ రోజు మీకు మిశ్రమ ప్రయోజనాలున్నాయి. కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు ఈ రోజు మంచిరోజు. అనుకున్న పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి కానీ పూర్తవుతాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి ప్రమాద సూచనలున్నాయి.
రాడిక్స్ 7 (పుట్టిన తేదీలు 7,16,25)
7,16,25 తేదీల్లో పుట్టినవారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో సీనియర్ అధికారులు సహకరిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
Also Read: ఆశ్వయుజాన్ని శక్తిమాసం అంటారెందుకు , శరన్నవరాత్రులు ఎందుకంత పవర్ ఫుల్!
రాడిక్స్ 8 (పుట్టిన తేదీలు 8,17,26)
ఈ రోజు మీ జీవితంలో ఒడిదుడుకులు రావొచ్చు. మీరు మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ వ్యవహారాల్లో మర్యాదగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి..ప్రమాద సూచనలున్నాయి..
రాడిక్స్ 9 (పుట్టిన తేదీలు 9,18,27)
వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యం నిర్వహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోపం తగ్గించుకోండి..
Note: కొన్ని పుస్తకాలు,జ్యోతిష్యులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన ఫలితాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం