Horoscope Today: ఈ రాశుల వారికి ఈ రోజు భలే కలిసొస్తుంది…వీరు మాత్రం తగాదాకి ముందుంటారు…
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
ఆగస్టు 7, 2021 రాశిఫలాలు
మేషం
ఈరోజు గందరగోళంగా ఉంటుంది. అయినప్పటికీ రేపటి కోసం ఏపనీ వాయిదా వేయొద్దు. కుటుంబ సభ్యులతో వివాదం కారణంగా మానసికంగా కలత చెందుతారు.తొందరపడి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఎక్కువగా ఆలోచించవద్దు. కాలమే సమస్యల్ని పరిష్కరిస్తుంది. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
వృషభం
మీకు ఉపయోగపడే సమాచారాన్ని పొందుతారు. బంధువుల ఇంటికి వెళతారు. పాతస్నేహితులతో చర్చలుంటాయి. పెట్టుబడి ఆఫర్లను వాయిదా వేయండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. విద్యార్థులకు అనుకూల సమయం. అనారోగ్య సమస్యలుంటాయి. అనవసరమైన వివాదాలలో చిక్కుకోకండి.
మిథునం
పిల్లల వైపు నుంచి శుభవార్త ఉంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. మీరు కొత్త పని ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి. స్నేహితులను కలుస్తారు. సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. సామాజికంగా ప్రశంసలందుకుంటారు. మాటల్ని అదుపుచేయండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. అప్పులు తీర్చగలుగుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి తక్కువగా ఉండొచ్చు. ఎవరితోనైనా గొడవపడే అవకాశం ఉంది. కుటుంబంతో సమయాన్ని గడపగలుగుతారు. మీ పని ముందుకు సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం
ఈరోజు సింహరాశివారికి అంతగా కలసిరాదు. రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఎవరితోనైనా వివాద సూచనలున్నాయి. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిన అప్పు మొత్తం పొందడం కష్టమవుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు.
కన్య
ఈరోజు మీకు చాలా బావుంటుంది. మీ నైపుణ్యాన్ని అధికారులు గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ఇంటి సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి.
తులారాశి
ఈరోజంతా సంతోషంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. మీ పనులన్నీ దాదాపుగా పూర్తవుతాయి. దినచర్యను మార్చడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. నగదుదుర్వినియోగానికి దూరంగా ఉండండి.
వృశ్చికరాశి
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. దూషించే పదాలను ఉపయోగించవద్దు. మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవచ్చు. స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు ప్రస్తుతానికి పరిష్కారం కావు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. కొత్తగా పెట్టుబడులు పెట్టొద్దు.
ధనుస్సు
కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. తెలియని వ్యక్తుల వల్ల కొంత నష్టం ఉండొచ్చు. అవివాహితులకు సంబంధాల సమాచారం రావచ్చు. ఖర్చులు నియంత్రించడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. రుణం మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం
తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలి.భూమి లేదా ఇంటికి పెట్టుబడి పెట్టొచ్చు. చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అకస్మాత్తుగా బంధువుతో సమావేశం ఉండొచ్చు. మీ ప్రత్యర్థులపై నిఘా ఉంచండి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
కుంభం
కుంభరాశివారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధువుల మద్దతు లభిస్తుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితులతో సమయం గడుపుతారు. శుభవార్త వింటారు. ఆఫీసులో ఎవరితోనైనా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
మీనం
ఈరోజు వ్యాపారస్తులకు అనుకూల సమయం. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మీరు కొత్త సమాచారాన్ని పొందుతారు. భగవంతుడిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. పని ప్రదేశంలో శుభవార్తలు వింటారు.