ఆగష్టు 30 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక విషయాల్లో తొందరపాటుని తగ్గించుకోవాలి
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 2023 August 30th
మేష రాశి
ఈ రాశివారు వ్యాపారంలో వృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఈ రోజు శుభవార్త వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగువేయాలి అనుకుంటే ప్రయత్నం చేయవచ్చు. స్నేహితులను కలుస్తారు. మీ వ్యక్తిత్వం ఆకట్టుకునేలా ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశివారి మనస్సు కొంత విచారంగా ఉంటుంది కానీ సాహసోపేతమైన పనులు చేసేందుకు అస్సలు వెనుకాడరు. వ్యాపారంలో పెద్ద విజయాలు సాధిస్తారు. కొత్త వ్యాపార ఒప్పందాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు కృషికి అర్ధవంతమైన ఫలితాలను పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి.
మిథున రాశి
ఈ రాశి ఉద్యోగులకు హక్కులు పెరుగుతాయి. విద్యార్థులు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభిస్తే సక్సెస్ అవుతారు. రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేందుకు ప్లాన్ చేసుకోవాలి. అలసట, ఒత్తిడి తోపాటూ బలహీనంగా అనిపిస్తుంది. విజ్ఞతతో, విచక్షణతో పని చేయాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
Also Read: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఇది!
కర్కాటక రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆలోచనలను నియంత్రించుకోవాలి.ఈ మనస్సు చంచలంగా ఉంటుంది. మీకు సరైన విశ్రాంతి అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ దినచర్య గందరగోళంగా ఉండొచ్చు.
సింహ రాశి
ఈ రాశివారికి ఈ రోజు పనిభారం పెరుగుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు పొందుతారు. శారీరక సుఖాల పట్ల కోరిక పెరుగుతుంది. ఈ రోజు మీరు చాలా రిలాక్స్‌గా ఉంటారు. కార్యాలయంలో మీకు అనుకూలంగా పనులు చాలా సులభంగా జరుగుతాయి.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీ విషయంలో తొందరపాటు కారణంగా కొంత నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. శత్రువుల యాక్టివ్ గా ఉంటారు కానీ మిమ్మల్ని అధిగమించడంలో విఫలం అవుతారు. మీరు వేసే ప్రణాళికలు విజయవంతం అవుతాయి.
తులా రాశి
తులా రాశివారు ఏదో నిరాశలో ఉంటారు. వ్యాపారులు లావాదేవీలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. నూతన ప్రణాళికలు వేసుకుంటారు. మనసైనవారి విషయంలో మనసులో కొంత ఆందోళన ఉంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త.
Also Read: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు!
వృశ్చిక రాశి
ఈ రాశివారికి వైవాహిక సంబంధాలలో ఇబ్బందులుంటాయి. కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి గందరగోళానికి పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. సాంకేతిక రంగానికి చెందిన విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది.
ధనస్సు రాశి
ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ఎగుమతి-దిగుమతి సంబంధిత వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. పరిశోధనా పనికి సంబంధించిన రంగంలో మీరు అద్భుతమైన విజయాన్ని పొందవచ్చు.
మకర రాశి
ఈ రాశులవారికి కుటుంబం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులు అప్పులు చేయాల్సి రావొచ్చు. కొన్ని విషయాల్లో నిజం దాచడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో వాదనలు పెట్టుకోవద్దు.
కుంభ రాశి
ఈ రాశివారు సన్నిహితులను నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక లాభాలు పొందే మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. కొత్త విషయాల అధ్యయనంపై ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో కొన్ని సాంకేతిక మార్పులు చేస్తారు. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త.
మీన రాశి
ఈ రాశివారు సౌమ్యంగా ఉండడం చాలా మంచిది. ఇతరుల సలహాల మేరకు పనిచేయవద్దు..మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం మంచిది. పనిలో నిరాశక్తత ఉండొచ్చు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. అజీర్ణ సమస్యలు ఉండొచ్చు. పూర్వీకుల ఆస్తి విషయంలో కుటుంబంలో చికాకులు ఏర్పడవచ్చు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.