అక్టోబర్ 19న తులా రాశి వారికి మంచి రోజు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి, దీనివల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. అయితే, తొందరపాటు నిర్ణయాలు, గుడ్డి నమ్మకాలు, భాగస్వామ్యాలకు దూరంగా ఉండాలి.
19-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: ఈ రోజు ధనయోగం, కొత్త అవకాశాలు!
Today Horoscope 2026 October 19: తులా, వృశ్చిక, ధనస్సు రాశుల వారి వృత్తి, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం ఫలితాలు. ఏ రాశి వారికి గొప్ప విజయం, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి? తెలుసుకోండి

- తులారాశికి ఆర్థిక లాభం; పెట్టుబడులలో జాగ్రత్త, తొందర వద్దు.
- వృశ్చిక రాశి వారికి నూతన వ్యాపార లాభాలు, ఉద్యోగ అవకాశాలు.
- ధనస్సు రాశికి ఆర్థిక సమస్యలు తీరి, వ్యాపారంలో పురోగతి.
Horoscope Today October 19th- తులా, వృశ్చిక, ధనస్సు రాశుల అక్టోబర్ 19 రాశిఫలాలు
అక్టోబర్ 19 సోమవారం ఆశ్వయుజ శుద్ధ నవమితో నవరాత్రులు ముగుస్తాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకూ ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత శ్రవణం ఉన్నాయి. మహర్నవమి రోజు సర్వార్థ సిద్ధి యోగం, ధృతి యోగం, బుధాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం, పారిజాత యోగం, వాశి యోగం, ఆనందాది యోగం, సునాఫ యోగం కారంగా మేష రాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి వారికి మాలవ్య యోగం ఉంటుంది.
తులా రాశి (Libra Horoscope Today)
తులారాశి వారికి అక్టోబర్ 19 సోమవారం మహర్నవమి మంచి రోజు . ఈ రోజు మీరు తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. దీనివల్ల మీకు ఆర్థిక లాభం చేకూరుతుంది. మీ డబ్బు వ్యాపారంలో చిక్కుకుపోయి ఉంటే, ఈ రోజు అది మీకు తిరిగి రావచ్చు. అయితే, ఈ రోజు మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. భాగస్వామ్యాలలో పనిచేయాలన్న ఆలోచన చేయవద్దు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు
19-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశిఫలాలు: అఖండ ధనయోగం, అదృష్టం!
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
నూతన వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వృశ్చిక రాశివారికి అక్టోబర్ 19 సోమవారం మహర్నవమి అనుకూలమైన రోజు అవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నూతన పెట్టుబడులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే మీ కుటుంబ పెద్దలను సంప్రదించండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానికి భోజనం చేయడం అవససం.
ధనస్సు, మకర రాశుల వారఫలాలు అక్టోబర్ 18 to 24 : మీ జీవితంలో కీలక మార్పులు!
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశివారికి అక్టోబర్ 19 మహర్నవమి రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబ సహకారంతో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో పురోగతికి సంకేతాలు కనిపిస్తాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. మీరు మీ కుటుంబంతో కలిసి పూజ, భజన, లేదా కీర్తన వంటి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. సంయమనం పాటించండి.
19-10-2026 మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మహా నవమి రోజు శుభమా, సవాళ్లా?
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహసంచారం ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
Frequently Asked Questions
తులా రాశి వారికి అక్టోబర్ 19 ఎలా ఉంటుంది?
వృశ్చిక రాశి వారు అక్టోబర్ 19న ఎలాంటి అవకాశాలు ఆశించవచ్చు?
వృశ్చిక రాశి వారికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. వ్యాపారంలో మంచి లాభాలు, ఉద్యోగం మారే వారికి అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
ధనస్సు రాశి వారికి అక్టోబర్ 19న ప్రధానంగా ఏ అంశాలు అనుకూలంగా ఉంటాయి?
ధనస్సు రాశి వారికి మహర్నవమి రోజు శుభప్రదం. కుటుంబ సహకారంతో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో పురోగతి, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటాయి.
ట్రెండింగ్ వార్తలు




















