Horoscope Today 15th January 2023: సంక్రాంతి లక్ష్మి కరుణ ఈ రాశులవారిపై ఉంటుంది, జనవరి 15 రాశిఫలాలు
Rasi Phalalu Today 15th January 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
15th January 2023 Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీకు ప్రత్యేకమైన రోజు. ఇంటికి స్నేహితుడి రాక సంతోషాన్నిస్తుంది.కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించవచ్చు. ఈ రాశి ఉద్యోగులు పెద్ద ఆఫర్ పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
వృషభ రాశి
మీ రోజు మీరు సరదాగా గడుపుతారు. పనిని సకాలంలో పూర్తి చేయడంలో ఉన్న వైఫల్యం ఉద్యోగంలో సమస్యలను కలిగిస్తుంది. జీవితంలో సమతుల్యతను పెంపొందించుకోవడం, పనులను సక్రమంగా చేయడం వల్ల గొడవలు తగ్గుతాయి.
మిథున రాశి
స్నేహితుడి ఉదాసీనత ఈ రోజు మిమ్మల్ని బాధపెడుతుంది, కానీ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. ఇది సమస్యగా మారనివ్వవద్దు మరియు దానిని నివారించడానికి ప్రయత్నించండి. ఆకస్మిక లాభం లేదా స్పెక్యులేషన్ ద్వారా ఆర్థిక పరిస్థితులు బలపడతాయి.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లాలనుకుని మళ్లీ ఆలోచన విరమించుకుంటారు. ఒకరి పట్ల మీరు సొంతంగా ఆలోచించి అభిప్రాయానికి రండి..చెప్పుడు మాటలు వినొద్దు.
సింహ రాశి
ఈ రాశివారి తల్లిందండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నట్టైతే ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. జీవితంలో ముందుకు సాగుతూనే ఉంటారు. కెరీర్‌లో భవిష్యత్తులో లాభాలు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీరు నష్టపోయే సంకేతాలు ఉన్నందున నూతన పెట్టుబడులు పెట్టొద్దు.
Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
కన్యా రాశి
నిరాశ, నిస్పృహలకు లోనుకాకండి. పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు ...అయితే..సరైన సలహాతో మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఇంటిని అలంకరించడానికి మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించండి.
తులా రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. అధికారి వర్గం నుంచి సానుకూల స్పందన పొందవచ్చు. చిన్న పనులకు మీకు ఎక్కువ సమయం పడుతుంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులతో మీకు చిన్న వాదనలు ఉండవచ్చు. తల్లిదండ్రుల సహకారం తక్కువగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారు పనికిరాని వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. అప్పులు చేయొద్దు. డబ్బు, ముఖ్యమైన పత్రాలను జాగ్రత్త చేయండి. రోడ్డుపై నియంత్రణ లేకుండా డ్రైవ్ చేయవద్దు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీ భాగస్వామికి కోపం తెప్పించేలా ప్రవర్తించకండి. కుటుంబంలో సమస్యలు తగ్గాలంటే మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. అదనపు డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. కుటుంబానికి సమయం కేటాయించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
Also Read: శని బాధలు తొలగిపోవాలంటే సంక్రాంతికి ఇలా చేయండి
మకర రాశి
ఈ రోజు మీ పనిలో కొన్ని ఆటంకాలు ఉండవచ్చు, దాని కారణంగా మీరు కొంచెం ఆందోళన చెందుతారు. ఓపికగా పని చేస్తే కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులకు కొంత ఒత్తిడి ఉంటుంది.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశివారు సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రయాణంలో మీరు కూడా పెద్ద ప్రయోజనం పొందుతారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. ఈరోజు మనసుకి కావాల్సిన విశ్రాంతి ఇస్తే బావుంటుంది.
మీన రాశి
ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. ఓ ప్లాన్ ప్రకారం పనులు చేయడం మంచిది. మీ జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక ప్రదేశ సందర్శనకు వెళతారు.వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.