CPI Narayana: జగన్ రాక్షస పాలనకు ప్రజలు త్వరలో బుద్థి చెప్తారు, సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
CPI Narayana: లోకేష్ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని, అసలు ఆయన్ను చూస్తే జగన్ కు భయం ఎందుకని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.
CPI Narayana: లోకేష్ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. లోకేష్ ను చూస్తే ముఖ్యమంత్రి జగన్ కు భయం ఎందుకని అన్నారు. ప్రతిపక్షాలను స్వేచ్ఛగా నిరసనలు, పాదయాత్రలను చేసుకోనివ్వండని తెలిపారు. జగన్ రాక్షస పాలనకు ప్రజలు త్వరలో బుద్థి చెప్పాలని అన్నారు. టిడ్కో ఇళ్లను ఎందుకు లబ్థిదారులకు కేటాయించలేదని అడిగారు. 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను కక్ష సాధింపు చర్యలో భాగంగాగనే నిలిపేశాని ఆయన ఆరోపించారు. బటన్ నొక్కడం వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. జగన్ పరిపాలనలో రాష్ట్రాభివృద్థి ఎక్కడ ఉందని నిలదీశారు. సీఎం జగన్ ను పారిశ్రామిక వేత్తలు నమ్మడం లేదన్నారు. పరిశ్రమల కోసం 13 లక్షల కోట్ల పెట్టుబడులు కాకిలెక్కలు తప్ప.. ఏపీకి పరిశ్రమలు రావన్నారు. కొత్త పరిశ్రమలు ఏపీకి వచ్చే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. విశాఖ సమ్మిట్ అంతా నాటకమేనని నారాయణ వ్యాఖ్యానించారు.
ఇటీవలే గన్నవరం ఘటనలో సీఎం జగన్ పై ఫైర్...!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. పది కాలాల పాటు అధికారంలో ఉండాల్సిన సీఎం, తన రాజకీయానికి తానే ముగింపు పలుకుతున్నట్లు అర్థం అవుతుందన్నారు. వైసీపీ వాళ్లే కొట్టి, వైసీపీ వాళ్లే పట్టాభిపై కేసులు పెట్టడం దారుణం అన్నారు. కుటుంబంలో కూడా శత్రుశేషం ఉండకూడదని భావించే ఆయన.. ప్రతిపక్షాలను ఇలాగే ఇబ్బంది పెడతారని వివరించారు. పులివెందులతో వైఎస్ వివేకానంద రెడ్డిని బయట వారు హత్య చేయలేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన చేస్తుంటే.. వైసీపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తోందని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటనలో కరెంట్ కట్ చేయడం అవసరమా అంటూ ఫైర్ అయ్యారు. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని అడిగారు. పట్టాభి ఆరోగ్య విషయంలో డాక్టర్లు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారని సీపీఐ నారాయణ తెలిపారు. ఏపీలో వైద్యుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు శత్రుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీపీఐ నేతలు మద్దుతు ఇవ్వడంతో తప్పేముందని నారాయణ ప్రశ్నించారు.
మరోవైపు పట్టాభి విషయంలో పోలీసుల తీరుపై టీడీపీ ఫైర్
గన్నవరం కేంద్రంగా జరిగిన ఉద్రిక్తతలకు తెలుగు దేశం పార్టికి చెందిన నేత పట్టాభి బాధ్యుడిని చేశారు పోలీసులు. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని తీవ్రంగా హింసించారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పోలీసులు తీరు పై తెలుగు దేశం పార్టికి చెందిన నేతలు ఆందోళనలు చేశారు. పట్టాభి భార్య సైతం తన భర్త అచూకి చెప్పాలంటూ ,తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె డీజీపీని కలిసేందుకు ప్రయత్నించటంతో ఆమెను హౌస్ అరెస్టు చేశారు. ఇదంతా గన్నవరం సీటు కోసమే పట్టాభి తెలుగుదేశం తరపున రేస్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఢీ కొట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన నేతను నిలబెట్టాలని, తెలుగు దేశం నేతలు భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఉండగానే, వల్లభనేని వంశీ గన్నవరంలో శాసన సభ్యుడిగా పాతుకుపోయారు. ఆయన్ను ఢీ కొట్టటం అంటే ఆషా మాషీ వ్యవహరం కాదు.