అన్వేషించండి

TDP vs YSRCP: చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటనకు పోటీగా ప్లాన్ చేసిన వైసీపీ- కరువు ప్రధాన అంశంగా కౌంటర్

Chandrababu Projects Tour: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్ట్ ల యాత్రకు కౌంటర్ ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.

YSRCP Ready to counter attack on Chandrababu Projects Tour: 
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్ట్ ల యాత్రకు కౌంటర్ ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను పార్టీ నాయకత్వం ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది.

చంద్రబాబుకు వైసీపీ కౌంటర్...
రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితులపై ప్రతిపక్ష నేత హోదాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు టూర్ ప్లాన్ చేశారు. దాదాపుగా వారం రోజులు పాటు ఆయా ప్రాజెక్ట్ లను సందర్శించేందుకు గాను ఇప్పటికే కర్నూలు జిల్లాకు చంద్రబాబు చేరుకున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ ల తీరు పై చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జగన్ సర్కార్ తీరు పై విమర్శలు గుప్పించారు. కనీసం ప్రాజెక్ట్ లకు గ్రీజు కూడపెట్టం లేదని ఎద్దేవా చేశారు. వరుసగా ప్రాజెక్ట్ లను సందర్శించి అక్కడ పరిస్థితులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగతామని చంద్రబాబు సర్కార్ అల్టిమేటం జారీ చేశారు.

పోటీ టూర్ కు ప్లాన్ చేస్తున్న వైఎస్ఆర్ సీపీ..
చంద్రబాబు రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్ట్ లపై ప్రభుత్వ తీరు పై విమర్శలు వ్యక్తం చేస్తూ సీఎం జగన్ అసమర్దత అంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు కూడా పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన ప్రాజెక్ట్ ల అవినీతి పై కూడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి వాస్తవాలను కూడ వెల్లడించాలని పార్టి శ్రేణులు భావిస్తున్నారు. ఒక్కొ ప్రాజెక్ట్ వద్దకు వైసీపీ నాయకులు వెళ్ళి అక్కడ పరిస్దితులను ప్రజలకు అర్దం అయ్యే విధంగా కార్యచరణ చేపడుతున్నారు. అంతే కాదు ప్రాజెక్ట్ వద్ద వాస్తవ పరిస్దితులు, సాగునీరు, ఆయకట్టు త్రాగునీటి అంశాల ను కూడ కూలంకుషంగా ప్రజలకు వివరించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న చర్యలను తిప్పికొడతాం అంటున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులకు వైసీపీ కేంద్ర  కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు హయాంలో కరువు...
చంద్రబాబు పాలన అంటేనే కరువు అనే విషయం పై భారీగా ప్రచారం చేయాలని వైసీపీ నిర్ణయించింది. చంద్రబాబు పాలనలో వానలు లేక, ప్రాజెక్ట్ అన్ని ఎండిపోయిన దుస్థితిపై ఫోటో ప్రదర్శనలు ఇవ్వాలని, ఇప్పుడు వైఎస్ జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్ట్ లన్నీ నిండు కుండలా మారిన విషయాలపై  ప్రచారం చేయాలని పార్టి నాయకులు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసా ద్వార రైతులను ఆదుకుంటున్న తీరు రైతుల్లో వ్యక్తం అవుతున్న సంతోషం, వాస్తవ అంశాలను  వివరించేందుకు అవసరం అయిన రూట్ మ్యాప్ ను వైసీపీ రెడీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో గ్రామాల్లో నెలకొన్న కరువు పరిస్దితులు ఇక్కడ కీలకంగా ప్రస్తావించాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం అవసరం అయితే సోషల్ మీడియా లో భారీగా ప్రచారాలు చేసుకోవటం పై కూడ పార్టి శ్రేణులకు నాయకులు కార్యచరణను విడుదల చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget