అన్వేషించండి

RK Roja Comments: పందులు పందులే, నన్ను వెన్నుపోటు పొడుస్తు్న్నారు - రోజా ఆవేదన

Nagari Constituency: నగిరిలో వైసీపీ రెబెల్స్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది ఒక్కటైనా పందులు పందులే.. సింహం సింహమే అన్నారు.

RK Roja News: ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరు జిల్లా నుంచి వరుసగా మూడోసారి బరిలో అధికార పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సొంత పార్టీలోని నేతల నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఆ రెబల్స్‌ ఆమెకు తలనొప్పిగా మారారు. వారిపై తాజాగా మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డిని ఓడించడానికి అందరూ ఏకమయ్యారని ఆరోపించారు. ఎంతమంది ఒక్కటైనా పందులు పందులే.. సింహం సింహమే అన్నారు. కానీ, జగనన్న బాగుంటేనే మనం బాగుంటాం అనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. అలాగే మన కుటుంబాలు బాగుంటాయని ఎమ్మెల్యే రోజా అన్నారు.

నగిరిలో తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వైసీపీ రెబెల్స్ పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నగిరి నియోజకవర్గంలో అన్ని పదవులు అనుభవించి.. క్వారీల్లో అక్రమంగా సంపాదించుకొని.. తనను వెన్నుపోటు పొడుస్తు్న్నారని రోజా ఆరోపించారు. తనను ఓడించడానికి అందరూ ఒక్కటయ్యారని.. టీడీపీ అభ్యర్ది గాలి భాను ప్రకాష్ ను గెలిపించడానికి వైసీపీ రెబెల్స్ అతనికి సహకరిస్తున్నారని ఆరోపించారు. 

అలాంటి వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పాలని మంత్రి రోజా నగిరి ప్రజలకు సూచించారు. ప్రజలకు మంచి చేసిన తనను గెలిపించాలని నగరి ప్రజలకు రోజా విజ్ఞప్తి చేశారు. నగిరిలో మంత్రి రోజాతో పాటు, ఆమె భర్త సెల్వమణి విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరుసగా రెండుసార్లు నగిరి నుంచి గెలిచిన రోజా.. మరోసారి కూడా గెలవాలని నిశ్చయంతో ఉన్నారు. కానీ, ఆమెకు సొంత పార్టీ నేతలే సహకరించడం లేదు. వైసీపీలో ఉంటూ తనకు వ్యతిరేకంగా ప్రెస్‌ పెట్టిన నేతలపై రోజా ఇప్పటికే వైసీపీకి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకునేలా కూడా చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget