Sajjala : టీడీపీకి అనుబంధ విభాగంగా బీజేపీ... సజ్జల ఘాటు విమర్శలు !

ఏపీ బీజేపీని చూస్తే జాలేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎజెండాను అనుసరిస్తోందే తప్ప.. సొంత ఎజెండా లేదన్నారు. బీజేపీ నేతల స్క్రిప్ట్ టీడీపీ ఆఫీస్‌ నుంచి వస్తోందన్నారు.

FOLLOW US: 

విజయవాడ ప్రజాగ్రహ సభలో బీజేపీ నేతలు చేసిన విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ నేత, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అజెండానే బీజేపీ అమలు చేస్తోందని..  టీడీపీ అనుబంధ విభాగంగా బీజేపీ మారిందని విమర్శించారు. ఓ జాతీయ పార్టీ.. ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా మారడం తొలి సారి చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఏపీ బీజేపీని చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు.  మాటలు సోము వీర్రాజువే కానీ స్క్రిప్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వనుంచే వస్తోందని..  చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని మండిపడ్డారు. 

Also Read: పవన్‌ను పదే పదే టార్గె‌ట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?

సీఎం జగన్ టార్గెట్‌గా బీజేపీ రాజకీయాలు చేస్తోందని.. అమరావతిని స్కామ్ రాజధాని అంటారు.. మూడేళ్లలో మళ్లీ రాజధాని కడతామంటున్నారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా అనర్హతా వేటు వేయాలని ఎందుకు కోరరని సజ్జల ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఆధారాలు లేని ఆరోపణలతో అసత్యాల ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.  బీజేపీ ప్రజాగ్రహ సభ మంగళవారం పూర్తయిన తర్వాత కూడా పీఆర్సీ అంశంపై మీడియాతో మాట్లాడిన సజ్జల బీజేపీపై మండిపడ్డారు. 

Also Read: బ్రాహ్మణులే అర్చకత్వానికి అర్హులా..? తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు !
 
బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లే ప్రజాగ్రహ సభ ఏర్పాటు చేశారని.. దీని వెనుక ఉన్నది చంద్రబాబేనని అన్నారు.మామూలుగానే బీజేపీ పెద్దగా కనిపించదని, టీడీపీ కారణంగానే ఆ పార్టీ ఉనికిలో ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఒకరో, ఇద్దరో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాళ్ల వల్లే బీజేపీ ఏపీలో మనుగడ సాగిస్తోందని విమర్శించారు.  బీజేపీలోనే కాదు, అటు జనసేన పార్టీలోనూ టీడీపీ వాళ్లే చక్రం తిప్పుతున్నారని సజ్జల విమర్శించారు. ఒక పార్టీ పల్లవి అందుకుంటే ఇంకో పార్టీ రాగం అందుకుంటుందని, రాజకీయంగా టీడీపీ ఏ పాట పాడితే బీజేపీ, జనసేన అదే పాట పాడుతుంటాయని ఎద్దేవా చేశారు. అంతే తప్ప విపక్షాలకు సొంత ఆలోచన లేదని విమర్శించారు. రామరాజ్యం కావాలంటే వైఎస్ఆర్‌సీపీని అనుసరించాలని  ఏపీలో రామరాజ్యం నడుస్తోందని అన్నారు.

Also Read: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ANDHRA PRADESH YSRCP AP Politics AP BJP somu veerraju Sajjala Ramakrishnareddy

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్

YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్

NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ

NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ

SSC Paper Leakage Case : పదో తరగతి పేపర్ లీకేజీ కేసు, నారాయణ కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్

SSC Paper Leakage Case : పదో తరగతి పేపర్ లీకేజీ కేసు, నారాయణ కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్

Tirupati Mokkulu: వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో

Tirupati Mokkulu: వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన

PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !