అన్వేషించండి

YS Vivekananda Reddy: కడప జిల్లా ఎస్పీని కలిసిన వైఎస్ సునీత, వివేకానందరెడ్డి హత్య కేసు పరిణామాలపై ఆరా

YS Vivekananda Reddy: కడప జిల్లా ఎస్పీని శనివారం వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా కలిశారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించిన తాజా పరిణామాల గురించి తెలుసుకున్నారు.

YS Vivekananda Reddy: దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు ఏపీలో సంచలనం రేపిన వివేకా హత్య కేసులో సీఎం వైఎస్ జగన్ తమ్ముడు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చడం తెలిసిందే. అలాగే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉండగా.. కోర్టు కొద్దిరోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు. బెయిల్ గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆయన జైల్లో సరెండర్ కానున్నారు. ఇక ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగ్గా.. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది.

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రతీ వారం సీబీఐ ముందు విచారణకు హాజరవుతున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తు ఆ తర్వాత నెమ్మదించగా.. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసు విచారణ, దర్యాప్తు తీరును తెలుసుకునేందుకు శనివారం కడప ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ను వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిశారు. వైఎస్ వివేకా హత్య కేసు తాజా పరిణామాల గురించి ఆరా తీశారు. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. దర్యాప్తు ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎక్కడివరకు వచ్చింది? అనే విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కడప ఎస్పీగా సిద్దార్థ కౌశర్ బాధ్యతలు చేపట్టారు. దీంతో తొలిసారి మర్యాదపూర్వకంగా ఆయనను సునీత దంపతులు కలిశారు. ఈ సందర్భంగా వివేకా కేసు పూర్వాపరాల గురించి సిద్దార్థ కౌశల్‌కు ఇరువురు వివరించారు.

ప్రస్తుతం వివేకా హత్య కేసుపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో పులివెందులలోని తాజా పరిణామాలు, సునీత దంపతుల భద్రతపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి సునీత దంపతులు తీసుకెళ్లారు. దస్తగిరిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక దస్తగిరి భార్యకు ప్రాణహాని ఉందని విషయాన్ని ఎస్పీకి సునీత వివరించినట్లు తెలిసింది.  వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా దస్తగిరి ఉన్నాడు. అతడి వాంగ్మూలమే ఈ కేసులో కీలకంగా మారింది. అతడి వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులోని నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది.

వివేకానందరెడ్డి దగ్గర డ్రైవర్‌గా దస్తగిరి పనిచేశాడు. ఈ హత్యలో అతడు కూడా కీలకంగా వ్యవహరించాడు. దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే వివేకా హత్య కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న దస్తగిరికి బెయిల్ ఇవ్వడాన్ని అవినాష్ రెడ్డి వ్యతిరేకించారు. దీంతో అతడి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని కోరగా.. పిటిషన్ తిరస్కరణకు గురైంది

టాప్ హెడ్ లైన్స్

Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
Anna Konidela Visits Thirumala: పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
Breaking News: గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్
గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget