అన్వేషించండి

YS Viveka Case : వివేకా హత్య కేసులో కీలకంగా వైఎస్ సునీత వాంగ్మూలం - అందులో ఏముందంటే ?

వివేకా హత్య కేసులో వైఎస్ సునీత వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. పలు కీలక వివరాలను సీబీఐకి వెల్లడించారు.


YS Viveka Case :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో అనేక కీలక విషయాలు ఉన్నాయి. తాజాగా వివేకా కుమార్తె సునీత ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో పలు విషయాలను సునీత వెల్లడించారు. వివేకా హత్య కేసు ఛార్జ్‌షీట్‌తో సునీత వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారు.  

ఇంటికొచ్చి కలిసిన వైఎస్ భారతి 

కేసు విచారమ జరుగుతున్న సమంయలో ..ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న భారతి ఫోన్ చేశారని సీబీఐకి సునీత వాంగ్మూలం ఇచ్చారు. తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్ వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని..  ఎక్కువ టైం తీసుకోనంటూ భారతి వెంటనే ఇంటికి వచ్చేశారన్నారు.  వైఎస్ భారతి వెంట   విజయలక్ష్మి, అనిల్ రెడ్డి,  సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడంతో తాను ఆశ్చర్యపోయానన్నారు.  లిప్టు దగ్గరే నిలబడి భారతి తనతో మాట్లాడారని..  వైఎస్ భారతి ఆందోళనగా ఉన్నట్టు నాకు అనిపించిందన్నారు. నాన్న మృతి తర్వాత తొలిసారి ఇంటికొచ్చినందున భారతి బాధగా ఉన్నారని అనుకున్నానన్నారు.  ఇకపై ఏం చేసినా సజ్జలతో టచ్ లో ఉండాలని భారతి తనకు చెప్పారని సీబీఐకి తెిలపారు. 

మీడియాతో ఏం మాట్లాడాలో చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి 

మీడియాతో మాట్లాడాలని తనకు  సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారన్నారు.  సజ్జల ఆలోచన ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని  గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ విడియో పంపించానన్నారు. అయితే  వీడియో కాదు అంశానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని సజ్జల చెప్పారన్నారు.  జగనన్నతోపాటు అవినాశ్ పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల అన్నారని..  తాను అప్పటివరకు అవినాష్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.   అవినాష్ పేరు ప్రస్తావించాలని సజ్జల చెప్పినప్పుడు తాను అనుమానించానని  సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. సజ్జల సలహా మేరకే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టానన్నారు. 

రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా గొడవలు

అవినాష్ అభ్యర్థిత్వానికి మా నాన్న కోరుకోలేదని తెలుసని సునీత స్పష్టం చేశారు.  రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా గొడవలున్నాయన్నారు.   గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని తాను అడిగానని  పొరపాటు జరిగిందని తెలుసు.. క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేదన్నారు.  జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారని..– ఎవరో చేసిన పొరపాటుకు మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని తెలిపారు.  

టీడీపీ నేతలపై ఫిర్యాదు చేయాలని ఒత్తిడి 

మార్చురీ బయట ఉంటే ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నారని.. ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, టీడీపీ నేతలపై ఆరోపణలున్నాయన్నారు.   వివేకా ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని అవినాష్ నాకు చెప్పారని సునీత తెలిపారు.   టీడీపీ నేతలు మనసులో పెట్టుకొని ఈ నేరానికి పాల్పడ్డారని అవినాష్ అన్నాడని సునీత వాంగ్మూలం ఇచ్చారు. అయితే   ఆ ఫిర్యాదుపై నేను సంతకం చేయలేదన్నారు.   2019 జులైలోనే అవినాష్ రెడ్డిపై తనకు అనుమానం వచ్చిందని..  – మా కుమారుడికి ముందే తెలుసునని గజ్జల ఉదయ్ రెడ్డి తల్లి ఓ వ్యక్తితో అన్నారన్నారు.  మృతి విషయం బయటకు రాకముందే కుమారుడికి తెలుసునని ఎలా చెప్పారు? – అవినాష్, శివశంకర్ రెడ్డికి ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి అనుమానం వచ్చిందని సునీత తెలిపారు.  భారతి, సజ్జల తనతో జరిపిన వాట్సాప్ చాట్‌ వివరాలను  సీబీఐకి  సునీత ఇచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget