అన్వేషించండి

Andhra Pradesh: పులివెందుల ఎమ్మెల్యేను ఫేక్ జగన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? టీడీపీ పోస్ట్ వైరల్

Andhra Pradesh News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ఎత్తు కుదింపుపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందుకే ఆయనను ఫేక్ జగన్ అంటారని టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

YS Jagan is Fake Person TDP posts | అమరావతి: తాను చేసిన పనిని వేరే వాళ్ల మీద తోసేసి, తప్పించుకోవాలని చూడటం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తాను చేసింది వేరే వాళ్ల మీద తోయాలని చూస్తారని.. అందుకే మిమ్మల్ని ఫేక్ జగన్ అంటారంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించిన ఘనత వైసీపీ అధినేత జగన్ దేనని టీడీపీ కొన్ని జీవోలు, పోస్టులను బహిర్గతం చేసింది. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు అంటూ టీడీపీ తాజాగా చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ చేసిన సంచలన పోస్టులు ఇవే
‘రెండు ఫేజులు అంటూ పోలవరం ప్రాజెక్టు ఎత్తున 41.15 మీటర్లకు కుదించిన ఘనత మీదే కదా జగన్, మర్చిపోయారా ? మర్చిపోయినట్టు నటిస్తున్నారా ? పోలవరం ప్రాజెక్టును రెండు ఫేజుల్లో నిర్మిస్తామంటూ  ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి  పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు  ప్రతిపాదనలు పంపించింది మీ ప్రభుత్వంలోనే కదా,  ఫేకు జగన్.  2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-I&II అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ  అప్పటి స్పెషల్ సి.ఎస్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఓ.కు  లేఖ రాసి, డబ్బులు అడగలేదా ? మీరు, గతంలో మీ సారధ్యంలో ఉన్న మీ అధికారులు 41.15 మీటర్ల కోసం రాసిన లేఖలు మర్చిపోయారా ? మర్చిపోయినట్టు నటిస్తున్నారా ?  మీ దొంగ సాక్షిలో, గతంలో మీరు చేసిన పనులు మీరే రాసుకుని, మా పై దుష్ప్రచారం చేస్తున్నారా ?

కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదు 
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మా కూటమి ప్రభుత్వం మీ లాగా ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండదు.  గతంలో, 2014-19 మద్య చంద్రబాబు గారు ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా  45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును  నిర్మించి తీరుతాం..  పోలవరం ప్రాజెక్ట్ 45.72 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది.  150 అడుగులు నీరు నిలిపేది చంద్రబాబు. 45.72 మీటర్ల ఎత్తులో నీళ్ళు నిలబెడితేనే, చంద్రబాబు గారి కల అయిన నదుల అనుసంధానం జరిగి, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించేది. ఇందులో మా ప్రభుత్వానికి రాజీ ఉండదు. మీరు ఫేకు రాతలు మాని, ప్రజలకు ఉపయోగపడే రాతలు రాసి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి’ అని మాజీ సీఎం జగన్ కు టీడీపీ నేతలు అధికారిక ఎక్స్ ఖాతాలో హితవు పలికారు.

Also Read: Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Embed widget