అన్వేషించండి

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

బెయిల్ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించారు వైఎస్ భాస్కర్ రెడ్డి .


YS Viveka Case  :  వైఎస్ వివేకా  హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 15వ తేదీన  మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రిని పులివెందులలోని ఇంట్లో  అరెస్ట్ చేశారు. తర్వాత హైదరాబాద్ కోర్టులో హాజరు పరిచి చంచల్ గూడ జైలుకు తరలించారు. విచారణను పులివెందుల నుంచి  హైదరాబాద్‌కు మార్చడంతో.. నిందితులందర్నీ హైదరాబాద్‌ జైళ్లలోనే ఉంచుతున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా చంచల్ గూడ జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల ఆయనకు అస్వస్థత కలగడంతో వరుసగా రెండు రోజుల పాటు వైద్య చికిత్స అందించారు. ఈ ఈ క్రమంలో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 

ఇప్పటికే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్                             

అవినాష్ రెడ్డిని  సీబీఐ అరెస్ట్ చేయకుండా  తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇందు కోసం నాలుగు షరతులు పెట్టింది. పూచీకత్తులతో పాటు ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని.. చెప్పకుండా విదేశాలకు వెళ్లవద్దని  షరతులు పెట్టింది.  వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది.  అరెస్టు చేసిన‌ట్లు అయితే రూ. 5 ల‌క్ష‌ల పూచీక‌త్తుతో బెయిల్‌పై విడుద‌ల‌కు సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు ప్ర‌తి శ‌నివారం ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సీబీఐ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. సీబీఐకి అవ‌స‌ర‌మైన‌ప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.

అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తుడిచేశారనేందుకు ఆధారాలు లేవన్న న్యాయమూర్తి                        

అవినాష్ రెడ్డి దర్యాప్తులో కలగజేసుకున్నారనేందుకు ఏ విధమైన ఆధారం లేదా ఆరోపణలు కూడా లేవని జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. సాక్ష్యాల్ని ధ్వంసం చేయడంలో కీలకపాత్ర పోషించినట్టుగా సీబీఐ అతనిపై అభియోగాలు మోపినా.వాటిని ఆన్ రికార్డ్ చేసేలా సీబీఐ రుజువు చేయలేకపోయిందని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి కస్టోడియల్ విచారణ అవసరం లేదని భావిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సీబీఐ కార్యాలయానికి ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 5 గంటల మధ్యలో అవినాష్ రెడ్డి వెళ్లాలని, సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది. 

న్యాయపోరాటం చేస్తున్న వైఎస్ వివేకా కుమార్తె సునీత                      

మరో వైపు తండ్రిని చంపిన వారికి శిక్ష పడేంత వరకూ వదిలి పెట్టబోనని న్యాయపోరాటం చేసేందుకు వైఎస్ సునీత సిద్ధమయ్యారు. గంగిరెడ్డి  బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేసి..బెయిల్ రద్దు చేయించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులోనూ వెకేషన్ బెంచ్ విచారణలు జరుగుతున్నందున .. సెలవులు అయిపోయిన తర్వాత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పును సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget