అన్వేషించండి

Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

Joseph Ravan : జోసఫ్ రావణ్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ యువతను నక్సల్స్ వైపు ఆకర్షితులయ్యేలా కుట్ర చేశారని పోలీసులు ప్రకటించారు. ఆయన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు.

AP Police Action On Social Media Threats UAPA: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబంపై, సనాతన ధర్మంపై సోషల్ మీడియా వేదికగా అత్యంత అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ 'ప్రశ్న రావణ్'  చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుసుకుంది.   తాజాగా అతనిపై అత్యంత కఠినమైన దేశద్రోహ వ్యతిరేక చట్టం ఉపా ను ప్రయోగించారు. ఈ కేసులో జోసఫ్‌ను సోమవారం  న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. కోర్టు అతనికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితుడిని కఠిన భద్రత మధ్య జైలుకు తరలించారు.

అధికారిక వర్గాల నుంచి లభించిన పోలీసు రిమాండ్ రిపోర్టు ప్రకారం.. జోసఫ్ రావణ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ నాయకుడిని లేదా ఒక సామాజికవర్గాన్ని దూషించే పరిధిని దాటిపోయాయి. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించడానికి ఇతను తెరవెనుక వ్యూహం రచించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. విదేశీ శక్తులు లేదా దేశ విచ్ఛిన్నకర శక్తుల నుంచి వీరికి ఏవైనా ఫండింగ్ అందుతుందా? అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. ప్రాథమిక ఆధారాలు లభించడంతోనే దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యల కింద 'ఉపా' చట్టంలోని కఠిన సెక్షన్లను రిమాండ్ రిపోర్టులో చేర్చినట్లుగా పోలీసులు తెలిపారు.
 

 ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రావణ్ రెచ్చగొట్టేలా మాట్లాడారు. రావణ్ అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పదవుల్లో ఉన్న వారిని రావణ్ దూషించారు. రావణ్‌, వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టిస్తున్నారు.మావోయిస్ట్ హిడ్మాను కీర్తిస్తూ రావణ్‌ ప్రసంగాలు చేశారు. మావోయిస్టు భావజాలాన్ని రావణ్ ఫోన్‌లో గుర్తించాం. దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా రావణ్ పని చేస్తున్నారు. రావణ్ పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగమే. రావణ్‌కు సహకరిస్తున్న వ్యక్తులు ఎవరో తేల్చాల్సి ఉంది. నిందితుడు రావణ్‌ విచారణకు సహకరించటం లేదని పోలీసులు తెలిపారు. 

జోసఫ్ రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పదే పదే సాయుధ తిరుగుబాట్లను ప్రేరేపించేలా, ప్రభుత్వ వ్యవస్థలను కూల్చివేయాలనేలా మాట్లాడిన వీడియోలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వాక్ స్వాతంత్య్రం ముసుగులో సమాజంలో తీవ్రవాద ఆలోచనలను చొప్పించే ప్రయత్నం ఇక్కడ జరిగిందని పోలీసులు నిరూపించారు.  రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న మరికొన్ని సంచలన వివరాల ప్రకారం.. ఈ నిందితుడు కేవలం ఒక సాధారణ యూట్యూబర్ కాదని, ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవస్థలను టార్గెట్ చేసే  సైబర్ టెర్రరిజం కు పాల్పడ్డాడని వివరించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్యపై లైవ్ పెట్టి దాడి చేస్తానంటూ ప్రకటించడం వెనుక.. అభిమానులను రెచ్చగొట్టి రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలనే కుట్ర ఉందని పేర్కొన్నారు. నిందితుడి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ డేటాను విశ్లేషించగా.. కొన్ని అరాచక శక్తులతో ఇతనికి నిరంతరం సంబంధాలు ఉన్నట్లు డిజిటల్ సాక్ష్యాలు లభించాయని, అందుకే సాధారణ బెయిల్ రాని విధంగా ఉపా చట్టాన్ని వర్తింపజేశామని పోలీసులు రిపోర్టులో స్పష్టం చేశారు.

జోసఫ్ రావణ్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. అతని వెనుక ఉండి నడిపించిన రాజకీయ మాస్టర్ మైండ్స్ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ 14 రోజుల రిమాండ్ సమయంలో నిందితుడిని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు త్వరలోనే పోలీస్ కస్టడీ  పిటిషన్ వేయనున్నారు. సోషల్ మీడియా దుర్భాషలను, దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను అణచివేయడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్.. ఈ కేసు ద్వారా సోషల్ మీడియా ముసుగులో ఉన్న అరాచక శక్తులకు గట్టి హెచ్చరిక పంపినట్లయింది. ఎంతటి వారైనా దేశ భద్రతతో, సమాజ శాంతితో ఆడుకుంటే ఉపా  వంటి కఠిన చట్టాల కింద జీవితాంతం కటకటాల వెనక్కే వెళ్లాల్సి వస్తుందని ఈ పరిణామం రుజువు చేస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget