అన్వేషించండి

IPS AB Venkateswara Rao : హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట - ఒక్క రోజైనా పోస్టింగ్ దక్కేనా ?

Andhra News : ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ దక్కుతుందా ? క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Will AB Venkateswara Rao get the posting : ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది.  కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్త‌ర్వుల‌ను స‌స్పెండ్ చేసేందుకు ఉన్న‌త న్యాయ‌స్థానం నిరాక‌రించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్ష‌న్‌ను ఎత్తివేస్తూ ఇటీవ‌ల క్యాట్ ఉత్త‌ర్వులు ఇచ్చింది.  ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిష‌న్ వేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం.. క్యాట్ ఉత్త‌ర్వుల‌ను నిలుపుద‌ల చేసేందుకు నిరాక‌రించింది.

ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ ఆదేశం
 
ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్‌ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 

వైసీపీ హయాంలో ఐదేళ్లూ పోస్టింగ్ లేక సస్పెన్షన్ లో ఉన్న ఏబీవీ 

టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావుకు వైసీపీ హయాంలో పోస్టింగ్ దక్కలేదు. మొదట ఆరు నెలలు ఆయన ఖాళీగా ఉన్నారు. తర్వాత ఆయనపై రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో  సస్పెన్షన్ వేటు వేశారు.  హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. 

ఒక్కరోజు అయినా పోస్టింగ్ దక్కుతుందా ?

సుప్రీంకోర్టు  ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో సస్పెండ్‌ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అంటే గత ఐదేళ్ల కాలంలో ఆయన పధ్నాలుగు రోజులు మాత్రం పోస్టింగ్‌లో ఉన్నారు సస్పెన్షన్ లో ఉన్న కాలంలో జీత భత్యాలు కూడా దక్కలేదు. అయితే క్యాట్ ఆదేశించినా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. అధికారికంగా ఆయన ఈ నెల 31వ తేదీన రిటైర్ అవుతున్నారు. అంటే.. రిటైర్మెంట్ కు ఒక్క రోజు మాత్రమే ఉంది. సస్పెన్షన్ లో ఉండగానే రిటైరవుతారా.. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం.. పోస్టింగ్ లభిస్తుందా అన్నది అధికారవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. 

ఏబీవీ వెెెంకటేశ్వరరావు టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడని వైసీపీ వర్గాలు అనుమానిస్తూంటాయి. ఈ కోణంలో ఆరోపణలు కూడా చేస్తూంటారు. అందుకే ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్ ఇవ్వకుండా  సస్పెన్షన్ వేటు వేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తూ ఉంటాయి.                                                                     

 

టాప్ హెడ్ లైన్స్

DWCRA Tea Coffee Centres: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
AP Water Projects: ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
Kesineni Nani Vijayawada Metro Rail: అందరూ మెట్రో కావాలంటారు.. నాని మాత్రం వద్దంటున్నారు - విజయవాడ రాజకీయాల్లో కేశినేని వ్యూహం వెనుక అసలు కథేంటి?
అందరూ మెట్రో కావాలంటారు.. నాని మాత్రం వద్దంటున్నారు - విజయవాడ రాజకీయాల్లో కేశినేని వ్యూహం వెనుక అసలు కథేంటి?
Pawan Kalyan : పిఠాపురం ప్రజలకు డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌!
పిఠాపురం ప్రజలకు డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌!

వీడియోలు

IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DWCRA Tea Coffee Centres: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
AP Water Projects: ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
Telangana Polytechnic Students Protest: పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
Sahaa Trailer : అమీర్‌పేట్‌లో గుండు గీయించుకుంటానన్న హీరోయిన్ - ఫోన్ చేసి బూతులు తిట్టండన్న హీరో... ఎందుకంటే?
అమీర్‌పేట్‌లో గుండు గీయించుకుంటానన్న హీరోయిన్ - ఫోన్ చేసి బూతులు తిట్టండన్న హీరో... ఎందుకంటే?
Varun Tej: ఈసారి తప్పే జరగదు... నిహారికతో 'బరి'పై వరుణ్ తేజ్ సెన్సేషనల్ కామెంట్స్
ఈసారి తప్పే జరగదు... నిహారికతో 'బరి'పై వరుణ్ తేజ్ సెన్సేషనల్ కామెంట్స్
Singareni Gold Copper Exploration : బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!
బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!
Amaravati: అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
Embed widget