Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా
Rains in Andhra Pradesh Telangana: ఏపీలో సాధారణ నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి.
Rains in Telangana AP: తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, పశ్చిమ రాజస్థాన్ నుంచి వాయువ్య మధ్యప్రదేశ్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ ల మీదుగా దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వానలుంటాయని అలర్ట్ చేసింది ఐఎండీ. ఏపీలో సాధారణ నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Update)
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. వర్షం పడకపోతే మధ్యాహ్నం నుంచి ఉక్కపోత అధికంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైంది. వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీచనున్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 24, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం జిల్లా రాజం వైపు నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు విస్తరిస్తున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని చాలా భాగాల్లో వర్షాలంటాయి. అత్యధికంగా శ్రీకాకుళం - నరసన్నపేట పరిధిలో భారీ వర్ష సూచనతో పాటు పిడుగులు పడతాయని హెచ్చరించారు ఏపీ వెదర్ మ్యాన్. అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. విశాఖ నగరానికి దక్షిణ భాగాల్లో వర్షాలు కురుస్తాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రోజు తక్కువగా వర్షాలుంటాయి. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి.
Impact based weather forecast for the districts of Andhra Pradesh and Vijayawada city for next 2 days Dated 24.09.2022. pic.twitter.com/UiOrvNFhov
— MC Amaravati (@AmaravatiMc) September 24, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, గుంటూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ఎన్.టీ.ఆర్ జిల్లాల్లో ఈ రోజు తక్కువగా వర్షాలుంటాయి. ఈదురు గాలులు వేగంగా వీచనున్నాయి. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో చాలా తక్కువ చోట్లల్లో మాత్రమే వర్షాలున్నాయి, తప్ప విస్తారంగా వర్షాలు ఉండవని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.