అన్వేషించండి

Ram Gopal Varma: లోకేష్ ను చూసి నవ్వాలో, ఏడవాలా? - చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడు! ఆర్జీవీ షాకింగ్ రిప్లై

రాంగోపాల్ వ‌ర్మ స‌మాజానికి ఏం చేశాడు? ఏపీ రాష్ట్రాభివృద్ధికి ఏం చేశాడు? అని నారా లోకేష్ ప్రశ్నించారు. తనపై లోకేష్ చేసిన కామెంట్లపై వ్యూహం సినిమా దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో బదులిచ్చారు.  

Vyooham Director Ram gopal Varma:

డైరెక్టర్ రాంగోపాల్ వ‌ర్మ స‌మాజానికి ఏం చేశాడు? ఏపీ రాష్ట్రాభివృద్ధికి ఏం చేశాడు? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. తనపై లోకేష్ చేసిన కామెంట్లపై వ్యూహం సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో బదులిచ్చారు.  నారా లోకేష్ ను చూసి జాలి పడాలా, నవ్వాలో అర్థం కావడం లేదన్నారు.

తాను ఫిల్మ్ మేకర్ అని, సినిమాలు తీయడం తన పని అంటూ టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. మీలాగ నేను జనం కోసం పుట్టాను, పెరిగాను, జనం కోసమే చనిపోతాను లాంటి మాటలు చెప్పలేదంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు. ఇప్పటివరకూ అలాంటి మాటలు ఎప్పుడైనా చెప్పానా అంటూ లోకేష్ ను ట్విట్టర్ (ఎక్స్)లో వీడియో ద్వారా ప్రశ్నించారు. లోకేష్ తనను విమర్శించడాన్ని వర్మ స్వాగతించారు. అయితే ఏ పాయింట్ మీద తనను విమర్శించాలో కూడా లోకేష్ కు క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. తనను విమర్శించడానికి ఏపీ అభివృద్ధిలో వర్మ పాత్ర లాంటి పిచ్చి విషయాలు మాట్లాడనన్నారు.

ఒకవేళ తాను లోకేష్ స్థానంలో ఉంటే.. వాడు (వర్మ) పిచ్చోడు, హిట్ సినిమా తీసి ఎన్నిరోజులు అయింది, అలాంటి వ్యక్తి గురించి తాను స్పందించడం అవసరం లేదని అంటానన్నారు. అసభ్యకరమైన సినిమాలు తీస్తాడు, అడ్డదిడ్డంగా సినిమాలు చేస్తాడు. ఆ వీడియోలు చూస్తాడు. అలాంటి పర్సన్ గురించి స్పందించం వేస్ట్ అని చెబుతానన్నాడు వర్మ. ఇంత విషయం తెలియకపోతే ఎలా బేబీ అని లోకేష్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. తన లైఫ్ ఓపెన్ బుక్ అని, వెనకాల అమ్మాయిల ఫొటోలు చూస్తే అర్థమవుతుంది అన్నారు. నీలాగ (లోకేష్) లాగ స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో ఉన్న ఫొటోలు ఎక్కడో దాచిపెట్టే రకం తాను కాదన్నారు. అయితే చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి చూసి లోకేష్ మానసిక పరిస్థితి సరిగా లేదేమో.. దానిపై ఎక్స్ పర్ట్స్ ను సంప్రదించాలని ఆర్జీవీ సూచించారు. 

నాలాంటి వాడిని ఏ విషయంపై విమర్శించాలో కూడా తెలియకపోతే మీ తండ్రి చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడు అంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినట్లు లండన్ లాంటి చోటుకు వెళ్లి థోరపీ చేయించుకుంటే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న విషయాలకే హైరానా పడకూడదంటూ లోకేష్ కు విలువైన సలహా ఇచ్చానంటూ వీడియోను ముగించారు ఆర్జీవీ.

వర్మను లోకేష్ ఏమన్నారంటే..
చంద్రబాబు ఏపీ అభివృద్ధికి పాటుప‌డ్డారు, ల‌క్షలాది మందికి ఉద్యోగాలు క‌ల్పించారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ సమాజానికి, ఏపీ అభివృద్ధి కోసం ఏం చేశారని లోకేష్ మీడియాను ప్రశ్నించారు. చంద్రబాబు సైబరాబాద్ తయారు చేశారు, ఏపీ విభజన తరువాత నవ్యాంధ్రకు రాజధాని ఏర్పాటు చేశారని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారు. కియా మోటార్స్, టీసీఎస్ లాంటి ఎన్నో సంస్థలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారని లోకేష్ అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
Embed widget