అన్వేషించండి

Volunteers Resignations : రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలోకి వాలంటీర్లు - ప్రభుత్వం మారితే ?

Andhra News : వైసీపీకి ప్రచారం చేసేందుకు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీ వస్తే మళ్లీ వాలంటీర్లుగా నియమితులవుతారు.. కానీ ప్రభుత్వం మారితే ?

Volunteers are resigning to campaign for YCP :  ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.    వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. వారికి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు, ఫోన్లను  ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.  రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇక నేరుగా వైసీపీ తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజీనామా చేసినందున వారి కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. వారిని పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టాలన్న ఆలోచనతో వైసీపీ నేతలు ఉన్నారు. 

వైసీపీ కార్యకర్తలనే  వాలంటీర్లుగా నియమించారనే ఆరోపణలు                                          

 వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 ఇళ్లను ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నియమించారు. వారు సంక్షేమ పథకాలను లబ్ధిదారులను నేరుగా ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. వాలంటీర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కొన్ని ప్రాంతాల్లో విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించొద్దని పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఏప్రిల్ 1 నుంచి మూడు రోజుల పాటు పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వారి సేవలు నిలిపివేయాలని సూచించింది. 

ప్రజాధనం  జీతంగా తీసుకుంటున్నందున  రాజకీయ ప్రచారం చేయకుండా ఈసీ ఆంక్షలు                   

వాలంటీర్లు ఉద్యోగులు కారు. వారు గౌరవ వేతనానికి పనిచేస్తున్నారు. ఈ కారణంగా సర్వీస్ రూల్స్ వర్తించవు. అయితే ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందున రాజకీయ పార్టీలకు నేరుగా  పని  చేయలేరు. రాజీనామాలు చేస్తే ఎవరికైనా పని చేసుకోవచ్చ. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను.. మళ్లీ వాలంటీర్లుగా నియమించుకునే అవకాశంం ఉంది. కానీ ప్రభుత్వం మారితే రాజీనామా చే్సిన వారిని మళ్లీ తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు నేరుగా  వైసీపీకి పని చేసి ఉన్నారు కాబట్టి.. ప్రభు్తవం మారితే తీసుకోరు. 

రాజీనామాలు చేస్తే ఇక వాలంటీర్లు కాదు.... ప్రభుత్వం మారితే మళ్లీ తీసుకోరు !                        

రాజీనామాలు చేయకుండా.. వైసీపీకి పని చేయకుండా ఉన్న వాలంటర్లను మాత్రం కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వరుసగా హామీ ఇస్తూ వస్తున్నారు. వాలంటీర్లకు యాభైవేల వరకూ ఆదాయం వచ్చేలా చూస్తానని చెబుతున్నారు. వైసీపీ చెప్పినట్లుగా  చేయకుండా.. నీతిగా.. నిజాయితీగా విధులు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు రావంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది వాలంటీర్లు తటస్థంగా ఉన్నప్పటికీ మెజారిటీ వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. ప్రభుత్వం మారితే వీరెవరికి మళ్లీ అవకాశం  వచ్చే  చాన్స్ లే్దు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
Tiruppattur Result: తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
Vijay victory credit to Jagan: జగన్ ఫోటోతోనే విజయ్ గెలిచారా? వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రచారం కరెక్టేనా?
జగన్ ఫోటోతోనే విజయ్ గెలిచారా? వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రచారం కరెక్టేనా?

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RB Choudary : సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
Bengal Politics: మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
Tiruppattur Result: తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
Telangana Rains Update: తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
BJP’s CM face in West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Embed widget