News
News
X

Botsa Satyanarayana On Three Capitals: మూడు రాజధానులే మా విధానం, అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే అంశం పరిశీలన : మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana On Three Capitals: వికేంద్రీకరణే వైసీపీ ప్రభుత్వం విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్త జిల్లాలపై వినతులను కమిటీ పరిశీలిస్తుందన్నారు.

FOLLOW US: 

Botsa Satyanaraya On Three Capitals: 'ఒకటికి పది సార్లు చెబుతున్నాం. మేం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం' అని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. విజయనగరం(Vizianagaram)లో పర్యటిస్తు్న్న ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు రాజధానుల ఏర్పాటు కోర్టు ధిక్కరణ అవుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) ఆరోపణలపై మంత్రి స్పందించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు వైసీపీకి ప్రామాణికం కాదన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల బిల్లు పెట్టే అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.  మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానం మరోసారి స్పష్టం చేశారు.  జిల్లాల పునర్విభజన(District Reorganisation)పై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. ఉగాది(Ugadi)కి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన టీడీపీ 

ముమ్మాటికీ వికేంద్రీకరణే(Decentralization) వైసీపీ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. శివరామకృష్ణ కమిషన్‌ కూడా వికేంద్రీకరణను సూచించిందన్నారు. స్వప్రయోజనాల కోసం పోలవరాన్ని, ప్రత్యేక హోదాను టీడీపీ(TDP) తాకట్టు పెట్టిందని ఆరోపించారు. జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలను కమిటీ పరిశీలిస్తోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే పరిపాలనా వికేంద్రీకరణ తప్పనిసరి అని మంత్రి వెల్లడించారు. వికేంద్రీకరణ కోసం ఏం చేయాలో చేసి తీరుతామని బొత్స స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం బాధ్యత పూర్తిగా కేంద్రానిదే మంత్రి అన్నారు. 

అమరావతిలో తెలుగు తమ్ముళ్ల బినామీ ఆస్తులు 

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి డా.అప్పలరాజు(Appala Raju) ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వైయస్సార్ స్క్వేర్ వద్ద మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో బినామీల పేరిట తెలుగు తమ్ముళ్లు ఆస్తులు కూడబెట్టారని, ప్రజలను భ్రమల్లో ముంచి కమరావతిగా మార్చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్యాక్రాంతంగా 23 వేల ఎకరాలను పోగు చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆలోచన చేశారని కొనియాడారు. ఆయన నిర్ణయానికి మద్దతుగా విద్యార్థి లోకం ముందుకు రావడం హర్షణీయమని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.

Also Read: Dharmana Letter To CM Jagan : న్యాయవ్యవస్థ పరిమితులపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం - సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ధర్మాన సంచలన లేఖ !

Published at : 05 Mar 2022 06:47 PM (IST) Tags: three capitals YSRCP GOVT vizianagaram minister botsa Satyanarayana

సంబంధిత కథనాలు

Mohan babu :  షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు -  ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Krishna District: భార్యను కొరికిన భర్త, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు

Krishna District: భార్యను కొరికిన భర్త, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు

Breaking News Live Telugu Updates:కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

Breaking News Live Telugu Updates:కొత్త సీజేఐగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌

పట్టపగలే డాక్టర్ కిడ్నాప్‌నకు యత్నం- వ్యక్తిని పట్టుకొని చితకబాదిన ప్రజలు

పట్టపగలే డాక్టర్ కిడ్నాప్‌నకు యత్నం- వ్యక్తిని పట్టుకొని చితకబాదిన ప్రజలు

హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

హాస్టళ్ల విద్యార్థలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్

టాప్ స్టోరీస్

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Border Love Story :  ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి