అన్వేషించండి

Viveka Murder Case: ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో సీబీఐ వాదన - ఆయనదే కీలక పాత్రనట!

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని, వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయమంటూ తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. 

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఔ కోరింది. నిందితుడికి బెయిల్ రద్దుపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. అయితే సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర, అనిల్ వాదనలు వినిపించారు. వివేకానందరెడ్డి కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలకం అని తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని వివరించారు. సిట్ ఛార్జీ షీట్ వేయనందునే ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. హత్య వెనుక భారీ కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అలాగే గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.

అన్నీ పరిశీలించాకే ఏపీ హైకోర్టు బెయిల్ రద్దుకు నిరాకరించిందని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న అనుమానంతో బెయిల్ రద్దు చేయరాదని అన్నారు. సునీత తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ వాదనను సమర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. 

మరోవైపు నిన్న 8 గంటలపాటు అవినాష్ రెడ్డిపై ప్రశ్నల వర్షం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు బుధవారం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. సీబీఐ కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిని తీసుకుని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ముగుర్ని కలిపి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రెండు గంటల పాటు ముగ్గుర్నీ కలిపి ప్రశ్నించి.. ఆ తర్వాత విడివిడిగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.  వివేకా హత్య జరిగిన తరువాత అసలు ఏం జరిగింది..?హత్య చేసిన నిందితులు భాస్కర్ రెడ్డి ఇంటికి  రావడానికి కారణం ఏంటి..? అన్న అంశాలపై ప్రధానంగా వివరాలు తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. 

అప్రువర్ దస్తగిరి ఇచిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు ముగ్గుర్ని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.  హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు ఎందుకు తారుమారు చేశారు...? హత్యకు ముందు హత్యకు తరువాత ఎక్కడున్నారు...? గంగిరెడ్డి తో ఉన్న సంబంధాల గురించి ఆరా తీసినట్లుగా చెబుతున్నారు.  ఉదయ్ కుమార్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పరిచయం.. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా  నిందితుల కదలికలు పసిగట్టిన సీబీఐ పలు కొన్నాలో విచారణ జరిగినట్లు సమాచారం. 25వ తేదీ వరకూ ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు అవినాష్ రెడ్డిని   రోజూ సీబీఐ ఎదుట హాజరు కావాలని ఆదేశిచింది. ఈ కారణంగా గురువారం కూడా సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. 

అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల కస్టడీ కూడా మరో ఐదు రోజుల పాటు ఉంది. మొత్తం ఆరు రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ ప్రకారం ఆరు రోజుల పాటు ఇరువురిని సీబీఐ ఆఫీసుకు తీసుకు వచ్చి.. అవినాష్ రెడ్డితో కలిపి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పును న్యాయమూర్తి 24వ తేదీన ఇస్తారు. ఒక వేళ ముందస్తు బెయిల్ ఇస్తే అవినాష్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకున్నట్లే అవుతుంది. ముందస్తు  బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే సీబీఐ వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget