Vizag News: ఏడాది క్రితం ఉత్తారంధ్రలో మాయమయ్యాడు.. ఇన్నాళ్లకు సీమ జిల్లాలో దొరికాడు

వీడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు మిస్టరీ. ఏడాది క్రితం మాయమైన అతను చనిపోయాడంటూ స్టోరీలు కూడా వినిపించాయి. దానికి ఆధారాల్లేవన్న పోలీసులు మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి విచారించారు.

FOLLOW US: 
ఏడాది క్రితం వైజాగ్ లో అదృశ్యం అయిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఇన్నాళ్ళకి అనంతపురంలో దొరికాడు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు 2021 మార్చి 20వ తేదీన కనిపించకుండా పోయాడు. ఉద్యోగరీత్యా స్టీల్ ప్లాంట్‌కి వెళ్లిన వ్యక్తి ఆ తరువాత కనిపించకపోవడంతో ఉద్యోగులు , బంధువులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
ఒక్కసారిగా కనిపించకుండా పోయిన శ్రీనివాసరావుపై చాలా స్టోరీలు వినిపించాయి. శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ లో అగ్నికి ఆహుతి అయిపోయాడు అంటూ పుకార్లు చెలరేగాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీనివాస రావు చాలామందిని మోసం చేసాడనే ఆరోపణలూ ఉన్నాయి. వీటన్నిటినీ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అప్పటి నుంచి శ్రీనివాసరావు కోసం వెదుకుతున్నారు.
 
చివరకు నమ్మకమైన సోర్సుల ద్వారా అనంతపురంలో ఉంటున్నాడనే సమాచారం రావడంతో అక్కడకు వెళ్లింది పోలీస్ బృందం. అనంతపురంలోని ఆదర్శ్ నగర్‌లో ఉంటున్న శ్రీనివాస రావును గుర్తించి గాజువాక తరలించారు. అసలు శ్రీనివాస రావు అదృశ్యం వెనుక కారణాలేంటి అనే కోణంలో ప్రస్తుతం గాజువాక పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు పోలీసులు.
 
శ్రీనివాస రావు అదృశ్యం వెనుక కారణాలు ఏంటి :
 
ప్రస్తుతం పోలీసులకి శ్రీనివాసరావు ఇంతవరకూ అజ్ఞాతంలో ఉండడానికి గల కారణాలు ఏంటి అనే అంశం అర్ధం కావడం లేదు. గతంలో విశాఖ నగరంలోని కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకుని తరువాత మొహం  చాటేసాడనే ఆరోపణలు శ్రీనివాసరావుపై ఉన్నాయి. అందుకే ఆయన అజ్ఞాతంలోనికి వెళ్లాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అప్పుల బాధ భరించలేక అనంతపురం చెక్కేశాడేమో అని కూడా విచారణ చేస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏడాది పాటు అజ్ఞాతంలో బతికిన శ్రీనివాసరావు అదృశ్యం వెనుక కారణాలేంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. 
Published at : 25 Mar 2022 01:55 PM (IST) Tags: VIZAG Vizag Police Steel Plant Employee

సంబంధిత కథనాలు

Bhogapuram Air Port: భోగాపురం అంటే పెళ్లి కానేదు- ఊర్ని అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమంటే ఎలా? ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గోడు

Bhogapuram Air Port: భోగాపురం అంటే పెళ్లి కానేదు- ఊర్ని అల్లకల్లోలం చేసి ఎళ్లిపోమంటే ఎలా? ఎయిర్‌పోర్టు నిర్వాసితుల గోడు

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు

Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!