మహిళలను పశువుల్లా చూస్తున్నారు- నందిగామ మున్సిపల్ కమిషనర్‌పై ఛైర్‌పర్శన్ ఆరోపణలు- ఏడూస్తూనే విమర్శలు
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్ పర్స్ తన పరిస్థితి వివరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. అటెండర్ కూడా తన మాట వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు
అటెండర్ కూడ తనన మాట వినటం లేదని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్ పర్సన్ వరలక్ష్మి కంటతడి పెట్టి భావోద్వేగానికి గురయ్యారు. తన ఆరోగ్యం క్షీణించడానికి కారణం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జయరామ్ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా ప్రజా ప్రతినిధి కంట తడి..
ఒక్కో చోట..ఒక్కో విధంగా స్దానిక నాయకత్వం,అధికారులు మధ్య విభేదాలు బహిర్గం అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్ పర్స్ తన ఆవేదనను వ్యక్తం చేసుకునే క్రమంలో భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమె పక్కన ఉన్న వారు కూడ కనీసం ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించలేదు.
మున్సిపల్ కమీషనరే కారణం..
ప్రజాప్రతినిధిగా ఉన్న తనను మున్సిపల్ కమిషనర్ జయరాం డామినేట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆమె తన వేదనను వ్యక్తం చేశారు. ప్రతిసారి తనను అవమానానికి గురిచేసి కౌన్సిల్ మీటింగ్ కూడా తన అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. చివరకు అటెండర్ కూడా తన మాట వినడంలేదని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.. మున్సిపల్ కమిషనర్ జయరాం పై ఆమె తీవ్ర స్దాయిలో ఫైర్ అయ్యారు.
మున్సిపల్ కమీషనర్ కాదు..రాజకీయ నాయకుడు..
మున్సిపల్ కమిషనర్ జయరామ్ రాజకీయ నాయకుడుగా అవుతారమెత్తారని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన మున్సిపల్ ఛైర్ పర్సన్ వరలక్ష్మి తీవ్ర స్దాయిలో ధ్వజమెత్తారు. నందిగామలో వందకుపైగా అపార్ట్మెంట్ లు నిర్మించారని వాటికి అనుమతులు లేవని తెలిపారు. 100కుపైగా జి ప్లస్ టు అనుమతులు తీసుకొని, జి ప్లస్ ఫైవ్.. సిక్స్ అనుమతులు లేకుండా అక్రమంగా అపార్ట్మెంట్లు నిర్మించారని అంటున్నారు. అపార్ట్మెంట్లు నిర్మించే బిల్డర్ల వద్ద కమిషనర్ డబ్బులు తీసుకున్నారని, బిల్డర్ల వద్ద డబ్బులు వసూళ్లకు పాల్పడి అక్రమ నిర్మాణాలు నిర్మించుకోవడానికి సహకరిస్తున్నారిని కమిషనర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్‌పై వరలక్ష్మి ఫైర్ అయ్యారు.
శానిటరీ ఇన్ స్పెక్టర్ నుండి కమీషనర్ దాకా...
మున్సిపల్ కమీషనర్ పై ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్ పర్సన్ వరలక్ష్మి మరిన్ని కీలక ఆరోపణలు చేశారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జయరామ్ కు గతంలో కమిషనర్ గా చేసిన అనుభవం లేదని అన్నారు. ఇంతకు ముందు పశువులు డాక్టర్ గా పని చేశారని తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ గా పని చేసి అక్కడ నుండి అక్రమంగా మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు దక్కించుకున్నారని అంటున్నారు. మున్సిపల్ కమిషనర్ కు మహిళలతో ఎలా ప్రవర్తించాలో తెలియదని పశువుల డాక్టర్ కాబట్టి మహిళల్ని కూడా పశువుల్లాగా చూస్తున్నారని, మహిళా నాయకులు అంటే చిన్న చూపని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.