Kodali Nani: నన్ను, వంశీని లేపేయడమంటే కొబ్బరి చిప్పలు సంచిలో వేసుకోవడం కాదు: కొడాలి నాని
Kodali Nani: వల్లభనేని వంశీని, తనను లేపేయడమంటే కొబ్బరి చిప్పలు సంచిలో వేసుకోవడం కాదని కొడాలి నాని విమర్శించారు.
![Kodali Nani: నన్ను, వంశీని లేపేయడమంటే కొబ్బరి చిప్పలు సంచిలో వేసుకోవడం కాదు: కొడాలి నాని Kodali Nani Strong Counter To Chandrababu naidu And Nara Lokesh Kodali Nani: నన్ను, వంశీని లేపేయడమంటే కొబ్బరి చిప్పలు సంచిలో వేసుకోవడం కాదు: కొడాలి నాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/24/b676ed4f032866b1f55e1b3e703b9aa61692892822719798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kodali Nani: వల్లభనేని వంశీని, తనను లేపేయడమంటే కొబ్బరి చిప్పలు సంచిలో వేసుకోవడం కాదని కొడాలి నానీ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ చేసేది యువగళం కాదని, కమ్మగళమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎల్లో దేవుడు చంద్రబాబు కోసం పిల్ల దేవుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోని 33 నియోజవర్గాల నుంచి జనాలను పోగేసి గన్నవరంలో గొప్పగా సభ నిర్వహించామని డబ్బాలు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ వేవ్‌లో ఓడిపోయన వారందరిని తీసుకొచ్చి సీఎం జగన్‌ను, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, తనను నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కనక దుర్గమ్మ గుడి వద్ద కొబ్బరి చిప్పలు దొంగతనం చేసే బుద్దా వెంకన్న తనను, వల్లభనేని వంశీని లేపేస్తామని మాట్లాడుతున్నారని, కొబ్బరి చిప్పలు సంచిలో వేసుకుని తీసుకెళ్లినంత సులువు కాదని తమను వేసేయడం అన్నారు. అలాంటి వారందరిని లోకేష్ వెంటేసుకుని తనను గుడివాడలో డ్రాయర్‌తో నిలబెడతానని మాట్లాడుతున్నాడని, డైపర్ వేసుకొని కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్.. నన్ను డ్రాయర్‌పై నిలబెడతాడా అంటూ ప్రశ్నించారు.
వైసీపీ నేతలతో *చ్చ పోయించడానికి లోకేష్ ఏమైనా సులభ్ కాంప్లెక్స్ పెట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు. లోకేష్ డైపర్ నాయుడు అని, చంద్రబాబు డ్రాయర్ నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చాపురం వద్దకు వెళ్లే సరికి ప్రజలు లోకేష్ డైపర్ ఊడగొట్టి కుప్పానికి రిటర్న్ పాదయాత్ర చేసేలా కొడతారని అన్నారు. అక్కడ ప్రజలు తన్నితే కర్ణాటకలోనో, తమిళనాడులోనో పడతాడని విమర్శించారు. తమ పేర్లు రాసుకున్న ఎర్ర బుక్కులోని పేపర్లను ఎన్నికల అనంతరం తుప్పు నాయుడు, పప్పు నాయుడు వేరే దానికి ఉపయోగిస్తారని అన్నారు. చంద్రబాబుకు ఉన్న అల్జీమర్స్ లోకేష్‌కు ఏమైనా వచ్చిందా అన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో అంబటి రాంబాబును వెక్కిరించింది చంద్రబాబు కాదా అని అడిగారు?
ఎమ్మెల్యే ఆర్కే చేతిలో ఓడిపోయిన లోకేష్‌కు మంగళగిరి పలకడం రాదని ఎద్దేవా చేశారు. లోకేష అంత పనికిమాలిన వ్యక్తి, వెధవ ఎవరూ ఉండరని అన్నారు. చంద్రబాబు వద్ద కొట్టుకొచ్చిన పార్టీ ఉందని, ఎమ్మెల్యేగా గెలవలేక ఎమ్మెల్సీ అయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలవలోనేడు మూడు శాఖలకు మంత్రిగా పనిచేశారని అన్నారు. తనను, వంశీని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారని ప్రశ్నించే లోకేష్, ఇందిరా గాంధీని మోసం చేసిన తన తండ్రి చంద్రబాబును చొక్కా పట్టుకుని ప్రశ్నించాలన్నారు.
నమ్మి చెంత చేర్చుకున్న ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. వారికి ఏమాత్రం దమ్మున్నా టీడీపీ తరఫున గన్నవరం, గుడివాడలో పోటీ చేయాలని అన్నారు. పెళ్లాల పేర్లు, మామల పేర్లు చెప్పుకునే వాళ్లు తమ గురించి, జగన్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేనోడు జోగి రమేష్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. చూసుకుందాం అంటే తాము కూడా రెడీ అని, ఒక్కరు కూడా మిగలరని అన్నారు. అలాంటి వారికి భయపడేది లేదన్నారు. తన గురించి వంగవీటి రాధాని అడిగితే చెబుతారని అన్నారు. 2024 ఎన్నికలు అవగానే టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేష్‌ను తన్ని తరిమేస్తారని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)