By: ABP Desam | Updated at : 04 Jun 2022 01:08 PM (IST)
బుద్దా వెంకన్న హౌస్ అరెస్టు (Photo Source: Facebook)
ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుంది, హత్య లు చేయమని సీఎం ప్రోత్సహిస్తున్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో జరిగిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్యను తీవ్రంగా ఖండించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పల్నాడు బయలుదేరిన బుద్దా వెంకన్నను అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం జరిగింది. చివరగా బుద్దా వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
సీఎం ప్రోత్సహించడంతోనే హత్యలు
సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైఎస్సార్ సీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, అందుకే ఆ పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ పల్నాడులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ గూండాలు చంపేశారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ హత్యల వెనుక సూత్రధారి అని ఆరోపించారు. పిన్నెల్లిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ అల్లరి మూక దాడిలో చనిపోయిన జల్లయ్య మృతదేహానికి నివాళి అర్పించడానికి మేము ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని పోలీసులను , ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో నడుస్తున్నారు. డీజీపీ ఆఫీసు నుంచి వస్తున్న ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారు తప్ప.. శాంతిభద్రతలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
అప్పుడు సవాంగ్‌ను ఇప్పుడు రాజేంద్రనాథ్‌ను..
గతంలో మూడేళ్లు గౌతమ్ సవాంగ్ ను వాడుకుని పంపేశారని, రేపు ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనని తెలుసుకోవాలని సూచించారు. ఎవరినైనా సీఎం జగన్.. యూజ్ అండ్ త్రో గానే చూస్తారని బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ నేతలను రాజకీయంగా ఎదుర్కోలేక.. సీఎం జగన్ ఈ విధంగా మా పార్టీ కార్యకర్తలు, నేతల హత్యలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను ప్రజలు త్వరలోనే తరిమికొట్టి బుద్ధి చెబుతారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
ప్రధాన కుట్ర దారుడు ఎమ్మెల్యే పిన్నెల్లి
‘ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది. హత్యా రాజకీయాలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు. పల్నాడులో ముగ్గురు బీసి టీడీపీ కార్యకర్తలను హతమార్చారు. ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్షలు లేవు. జల్లయ్య మృతదేహానికి నివాళులు అర్పించకూడదా? కుటుంబ సభ్యుల సంతకం లేకుండానే జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయించడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చెల్లింది. బీసీ నాయకుల హత్యల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన కుట్ర దారుడు’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు బుద్ధా వెంకన్న.
Chandrababu: 'దుష్టులను శిక్షించాలని దుర్గమ్మను వేడుకున్నా' - మానవ సంకల్పానికి దైవ సహాయం అవసరమంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్ గడువు పొడిగింపు
Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Women MLAs In Telangana: ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కారు పంక్చర్- పదికి చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య
Bhadrachalam MLA: బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్, కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే! టచ్ లోకి మరో నలుగురు!
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
/body>