Trains Cancel: విజయవాడ పరిధిలో 25 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - కారణం ఏంటంటే
Telugu News: ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు విజయవాడ మీదుగా వెళ్లే ఏకంగా 25 రైళ్లను రద్దు చేసినట్టుగా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
South Central Railway: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నడిచే రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రైళ్లను నిలిపివేసినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. ఇంకా కొన్ని రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టుగా రైల్వే అధికారులు వివరించారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు విజయవాడ మీదుగా వెళ్లే ఏకంగా 25 రైళ్లను రద్దు చేసినట్టుగా వివరించారు. ఈనెల 24 నుంచి 28 వరకు 8 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. మరో 11 రైళ్లను దారి మళ్లించనున్నారు. పాక్షికంగా రద్దు చేసిన రైళ్లను రామవరప్పాడు స్టేషన్ వరకు మాత్రమే నడపనున్నట్టుగా రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
దారి మళ్లించిన వివిధ రైళ్ల వివరాలను ఇక్కడ తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ విడుదల చేసిన ప్రకటనలో చూడవచ్చు.
Cancellation of Trains pic.twitter.com/iH3MFXh3PT
— South Central Railway (@SCRailwayIndia) June 11, 2024
Several trains rescheduled and few to run in diverted route as safety works commenced BZA. @RailMinIndia @EastCoastRail @DRMKhurdaRoad @DRMSambalpur @SCRailwayIndia @serailwaykol pic.twitter.com/K1XyyIn1qQ
— DRMWALTAIR (@DRMWaltairECoR) June 11, 2024
Due to Traffic maintenance works over Vijayawada Division, South Central Railway the following trains are being Cancelled/ Partially Cancelled/Diverted as detailed below. Inconvenience caused is deeply regretted @SCRailwayIndia @RailMinIndia @DRMWaltairECoR @drmgnt pic.twitter.com/Pq4m0O8BqW
— DRM Vijayawada (@drmvijayawada) June 11, 2024