అన్వేషించండి
Advertisement
CM Jagan in Iftar: నేడు ఇఫ్తార్ విందుకు సీఎం జగన్ - ప్రకాశం బ్యారేజీపై రాత్రికి రాత్రే ఏం జరిగిందో తెలుసా?
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ నెల పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హజరు కానున్నారు.
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మెత్తం హజరు కానుంది. రంజన్ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యాన ముస్లిం పెద్దలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ నగరంలోని విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్ లో భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. నేడు సాయంత్రం 5. 30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5. 45 గంటలకు విద్యాధరపురం మినీ స్టేడియంకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. 5. 45 – 7. 15 గంటల వరకు ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ముస్లిం మత పెద్దలతో కలసి సామూహిక ప్రార్దనల్లో జగన్ పాల్గోంటారు. ముస్లిం పెద్దలను సత్కరిస్తారు. ఇదే వేదిక పై ముఖ్యమంత్రి జగన్ ను కూడా ముస్లిం పెద్దలు మర్యాద పూర్వకంగా సన్మానించనున్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
రాత్రికి రాత్రి ఎం జరిగిందంటే
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్తార్ విందు లో పాల్గొనేందుకు విజయవాడ కు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో అత్యంత కీలకం అయిన రహదారి ప్రకాశం బ్యారేజీపై రోడ్డు గోతులు పడిపోయింది. సమ్మర్ ఆరంభంలోనే వర్షాలు కూడా కురవటంతో, రోడ్డుపై గోతులు మరింతగా పెద్దవి అయ్యాయి. దీంతో ఇదే రహాదారిపై సీఎం జగన్ ప్రయాణించనున్న నేపద్యంలో అధికారులు రాత్రికి రాత్రి అప్రమత్తం అయ్యారు. ఆదివారం అర్దరాత్రి ఆకస్మికంగా ప్రకాశం బరాజ్ పై రాకపోకలను నిలిపివేశారు. రహాదారి పై గోతులను పూడ్చేశారు. రాత్రంతా పనులు చేసి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తిరిగి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలకు అనుమతించారు.
ముఖ్యమంత్రి రూట్ మ్యాప్ ఇదే
తాడేపల్లిలోని సీఎం నివాసం నుండి బయలు దేరి, ఎన్టీఆర్ కరకట్ట మీదుగా బోట్ యార్డ్, మద్రాస్ కాలువ మీదుగా, ప్రకాశం బ్యారేజీ, దుర్గగుడి, హెడ్ వాటర్ వర్క్స్, మీదుగా విద్యాధరపురంలోని స్టేడియం స్దలం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొంటారు.
నేడు బెజవాడలో ట్రాఫిక్ మళ్ళింపు.
1. జోజినగర్ జంక్షన్ నుండి సితార సెంటర్ వరకు, సితార సెంటర్ నుండి జోజినగర్ జంక్షన్ వరకు ఎటువంటి వాహనములు అనుమతించమని పోలీసులు తెలిపారు.
2. గొల్లపూడి వై జంక్షన్ వైపు నుండి సితార, చిట్టినగర్ వైపునకు వచ్చు అన్ని వాహనాలు, ఎక్కిన్ సన్ స్కూల్ రోడ్డు, కబేళా వైపునకు మళ్ళిస్తారు.
3. చిట్టినగర్ వైపు నుండి గొల్లపూడి, హెచ్. బి. కాలనీ, ఊర్మిళానగర్ వెళ్ళు వాహనములను సితార జంక్షన్ వద్ద కుమ్మరిపాలెం వైపునకు లేదా కబేళుా వైపునకు మళ్ళించడం జరుగుతుంది.
ఆర్. టి. సి. సిటీ బస్సు మళ్ళింపు ఇలా. . .
1. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వై. యస్. ఆర్ కాలనీ/మిల్క్ ప్రాజెక్టు /కబేళా నుండి కాళేశ్వరరావు మార్కెట్ వైపుకు వెళ్ళు బస్సులు కబేళా-ఊర్మిలా నగర్-జోజినగర్ చర్చి జంక్షన్ - స్వాతి జంక్షన్- కనక దుర్గా ఫ్లైఓవర్ సర్వీసు రోడ్డు –కుమ్మరిపాలెం –ఘాట్ రోడ్డు కెనాల్ రోడ్డు మీదుగా వెళ్ళాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఆహ్వానితులకు పార్కింగ్ ఇలా
1. A1 పాస్’’కలిగిన వారు VMC స్టేడియం వరకు వచ్చి అక్కడి నుండి విధ్యాధరపురం ఆర్. టి. సి. డిపోలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు కమీషనర్ తెలిపారు.
2. ఇఫ్తార్ విందుకు వచ్చేవారు సితారా సెంటర్/భగవతి కాటా వరకు వచ్చి VMC స్టేడియం ఎదురుగా నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశంలో వారి కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
3. ఇఫ్తార్ విందుకు వచ్చేవారు సితారా సెంటర్ వచ్చి అక్కడ ఉన్న నిర్దేశించిన పార్కింగ్ కోసం కేటాయించిన ప్రదేశములో వారి కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.
4. పాసులు కలిగిన ఆహ్వానితులు సాయంత్రం 5. 30 లోపు స్టేడియం వద్దకు చేరుకోవాలి. ఇఫ్తార్ విందుకు వచ్చే ఆహ్వానితులు వారి వాహనాలను విద్యాధరపురం VMC స్టేడియం పరిసర ప్రాంతాలలో పార్క్ చేసి ఇతర ఆహ్వానితుల రాక పోకలకు ఇబ్బంది కలిగించ వద్దని పోలీసులు తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement