అన్వేషించండి

నేడు నేతన్నల ఖాతాలో రూ. 24వేలు- నిధులు విడుదల చేయనున్న సీఎం

నేడు ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులను విడుదల చేయబోతున్నారు. నాలుగో విడతకు సంబంధించి మొత్తం 80, 546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతన్న కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. వరుసగా నాలుగో విడతకు సంబంధించిన వైఎస్ఆర్ నేతన్న హస్తం నిధులను ఈరోజు విడుదల చేయబోతున్నారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించే బహిరంగ సభలో బటన్ నొక్కి మరీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు, వారికి ఆర్థిక సాయం అందించడం ఈ పథకం లక్ష్యం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.24 వేలు నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారు. అలా ఐదేళ్ల కాలంలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1.2 లక్షలు అందుతుంది.

అయితే ఏపీ వ్యాప్తంగా మొత్తం 80,546 మంది నేతన్నలకు 4వ విడతలో భాగంగా 193.31 కోట్ల రూపాయలను సీఎం జగన్ నేడు జమ చేస్తారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు నేరుగా ఈ పథకం ద్వారా అందించిన మొత్తం సాయం 776.31 కోట్ల రూపాయలు. ఇప్పటికే 3 విడతల్లో సాయం అందగా తాజాగా నాల్గోవిడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది 2022 - 23 ఆర్థిక సంవత్సరానికిగాను కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులైన 4,100 మంది నేతన్నలకు 9 కోట్ల 84 లక్షల రూపాయలను లబ్ధాదారుల ఖాతాల్లో వేయబోతున్నారు. 

పెడనలోనే  7 చేనేత సహకార సంఘాలు..

కృష్ణాజిల్లాలో 5,192 మగ్గాలు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే 18, 027 మంది నేతన్నలు తమ వృత్తిలో కొనసాగుతున్నారు. చేనేత‌ పరిశ్రమ గత 500 ఏళ్లుగా ఈ ప్రాంతంలో స్దిర‌ప‌డింది. పెడన పట్టణంలోనే 5,800 మంది నేత పనిలో నిమగ్నమై ఉన్నారు. పెడనలో నూలుతో మెత్తటి వస్త్రాలు తయారు చేస్తారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న చేనేత సహకార సొసైటీలు 7 ఉంటే, కృష్ణా జిల్లాలో 37 చేనేత సహకార సొసైటీలు ఉన్నట్లు సమాచారం. మచిలీపట్నం, పెడన, కప్పల దొడ్డి,  ఆకులమన్నాడు, పోలవరం, రాయవరం, మల్లవోలు, చిన్నాపురం, చల్లపల్లి, శివరామదుర్గాపురం, పురిటిగడ్డ, ఘంటసాల, కాజా, గన్నవరం, ముస్తాబాద్, గుడివాడ, కనిమెర్ల, ఉప్పులూరు తదితర ప్రాంతాల‌్లో ప్రజలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.    

పథకం అర్హత..

ఈ పథకం కింద, దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా ఉండాలి. దరఖాస్తుదారుడు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా వృత్తి పరంగా నేత అయి ఉండాలి. ఈ పథకం కింద, దరఖాస్తుదారు చేనేత సంఘంలో నమోదు చేసుకోవాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. మగ్గాలు ఎన్ని ఉన్నా ఒక కుటుంబంలో ఒకరికే ప్రయోజనం అందుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget