అన్వేషించండి

Vijayawada Job Mela: విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన, రౌడీషీటర్లకు జాబ్ మేళా

Vijayawada Job Mela: రౌడీ షీటర్లలో పరివర్తనకు విజయవాడ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి విజయవాడ పోలీసులు రౌడీ షీటర్లకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

Vijayawada Job Mela: సాధారణంగా పోలీసులు రౌడీ షీటర్లకు అప్పుడప్పుడూ కౌన్సిలింగ్ ఇస్తుంటారు. కానీ విజయవాడ పోలీసులు(Vijayawada Police) మరో అడుగు ముందుకేశారు. వినూత్నంగా ఆలోచించి రౌడీ షీటర్లలో మార్పు తీసుకొచ్చేందుకు వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. రౌడీ షీటర్ల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తున్నారు. 

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో

నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తుంటారు. కానీ రౌడీ షీటర్ల కోసం జాబ్ మేళా ఎక్కడైనా విన్నారా, కచ్చితంగా విని ఉండరు. విజయవాడ పోలీసుల వినూత్న నిర్ణయం రౌడీ షీటర్లకు జాబ్ మేళా ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో నార్త్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల(Rowdy Sheeter)కు జాబ్ మేళాలో అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్థులలో మార్పు తీసుకొచ్చే దిశగా స‌న్నాహాలు చేస్తున్నారు. రౌడీ షీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఈ జాబ్ మేళా దోహదపడుతుందని డీసీపీ బాబురావు అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి(Skill Development Corporation) సంస్థతో క‌ల‌సి వ‌చ్చే శ‌నివారం ప్రత్యేకంగా జాబ్ మేళాను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని వెల్లడించారు. 

రౌడీ షీట్ తొలగించి ఉద్యోగావకాశం 

విజయవాడ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని డీసీలు, బీసీలు, సస్పెక్ట్ లు, రౌడీషీటర్లకు ఇన్స్పెక్టర్లు కౌన్సెలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భంగా వారితో గంజాయి, గుట్కా, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగిన  రౌడీషీటర్లకు వారి రౌడీ షీట్ లను తీసి వేసి  ఉపాధి అవకాశం కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తామని విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ బాబురావు తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Divyang Shakti Scheme: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
YS Sharmila fires on Jagan: అన్న అనే పేరుకే కళంకం - జగన్‌పై షర్మిల నిప్పులు - ఎందుకంటే?
అన్న అనే పేరుకే కళంకం - జగన్‌పై షర్మిల నిప్పులు - ఎందుకంటే?
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget