అన్వేషించండి

AP Local Body Elections: పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు.. ఫిర్యాదులపై తక్షణ విచారణ- ఏపీ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా

AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఎస్ఈసీ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కౌంటింగ్, బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి.

AP Local Body Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి శుక్రవారం ఎస్ఈసీ కార్యదర్శి డాక్టర్ ఎ. మల్లిఖార్జున, ఐజీ బి. రాజకుమారితో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, డీఐజీలతో ఒక ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదులు, తదుపరి విడత ఎన్నికల సన్నద్ధత, అలాగే పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ప్రారంభ దశలో కొన్ని జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలపై వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆదేశించారు. న్యాయం జరగడమే కాకుండా, అది ప్రజలకు స్పష్టంగా కనిపించాలని ఆయన తెలిపారు.

 బ్యాలెట్ పేపర్ల భద్రతపై

ఎన్నికల ప్రక్రియలో ప్రతి బ్యాలెట్ పేపర్‌కు పూర్తి జవాబుదారీతనం ఉండాలని, ఒక్క బ్యాలెట్ పేపర్ కూడా గల్లంతు కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కార్యదర్శి డాక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు.  పోలింగ్ కేంద్రాల నుంచి రిసెప్షన్ కేంద్రాలకు, అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులను తరలించే ప్రతి దశలో నిర్దేశించిన నిబంధనలు, ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సుల రవాణా, స్వీకరణ, భద్రపరిచే ప్రక్రియలో వీడియోగ్రఫీ, సీసీటీవీ పర్యవేక్షణ, అధికారుల సంతకాలు, రిజిస్టర్ల నిర్వహణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, సంబంధిత ఎన్నికల పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అప్పగించే సమయంలో వాటి సంఖ్య, తేదీ తదితర వివరాలతో లేఖ సిద్ధం చేసి, అధికారుల నుంచి రసీదు పొందాలని తెలిపారు.

స్ట్రాంగ్ రూమ్‌లకు సుమారు 100 మీటర్ల దూరంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీసు, సివిల్ అధికారులను అందుబాటులో ఉంచాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో జరుగుతున్న కార్యకలాపాలను అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు తగిన అవకాశం కల్పించాలని తెలిపారు.

 48 గంటల నిశ్శబ్ద కాలం  

పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలానికి సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం విక్రయాల నిషేధం, ఎన్నికల ప్రచారంపై వర్తించే ఆంక్షలను ప్రజలకు, రాజకీయ పార్టీలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు పత్రికా ప్రకటనల ద్వారా నిబంధనలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికేతర రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టణ స్థానిక సంస్థల పరిధిని విడిచివెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గెస్ట్ హౌస్‌లు, హోటళ్లు, కళ్యాణ మండపాల్లో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించాలని, అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

 రాత్రి 8 గంటల్లోగా కౌంటింగ్ పూర్తి  

ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభించి, రాత్రి 8 గంటల్లోగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేయాలని డాక్టర్ ఏ. మల్లిఖార్జున సూచించారు. మొత్తం 12 గంటల వ్యవధిలో కౌంటింగ్ పూర్తి చేసేందుకు అవసరమైన కౌంటింగ్ టేబుళ్లు, అదనపు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అర్హులైన ఓటర్లందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించాలని సూచించారు. అలాగే, పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి క్రెడెన్షియల్స్ వెరిఫికేషన్ పేరుతో ఎలాంటి అనవసర జాప్యం చేయరాదని, ఎన్నికల నిబంధనల ప్రకారం వారి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించరాదని స్పష్టం చేశారు.


Also Read : చొక్కా మడతవేస్తాం - జగన్ కామెంట్స్‌తో రాయలసీమలో పోలింగ్ ఉద్రిక్తం కానుందా?

పోలీసు బందోబస్తు 

ఐజీ బి. రాజకుమారి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో, డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు ప్రక్రియలో ఎలాంటి భద్రతా లోపాలకు అవకాశం లేకుండా ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని, స్ట్రైకింగ్ ఫోర్సులను వ్యూహాత్మకంగా మోహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Also Read : ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్

Frequently Asked Questions

పోలింగ్‌కు ముందు ఎలాంటి నిబంధనలు అమలు చేయాలి?

పోలింగ్‌కు ముందు 48 గంటల నో మైక్ నిబంధనలను, మద్యం విక్రయాల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులు తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
YS Jagan Election : చొక్కా మడతవేస్తాం - జగన్ కామెంట్స్‌తో రాయలసీమలో పోలింగ్ ఉద్రిక్తం కానుందా?
చొక్కా మడతవేస్తాం - జగన్ కామెంట్స్‌తో రాయలసీమలో పోలింగ్ ఉద్రిక్తం కానుందా?
Income Tax Raids: ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
Bigg Boss Season 10 Today October 30th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
Income Tax Raids: ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
Embed widget