News
News
X

Justice Battu Devanand : రాజధాని ఇదీ అని చెప్పుకునే పరిస్థితి ఉందా?, ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ కీలక వ్యాఖ్యలు

Justice Battu Devanand : రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకునే పరిస్థితి లేదని హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ అన్నారు.

FOLLOW US: 

Justice Battu Devanand : తెలుగు జాతి అంటే చులకన అయిపోయింది అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల వారి దగ్గర అవమానాలు పొందే పరిస్థితిలో మనం ఉన్నామన్నారు. ‘‘మనలో ఐక్యత లేదు, ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం. మా కుమార్తె దిల్లీలోని కాలేజీలో చదువుతోంది. మా కుమార్తెను తోటి విద్యార్థులు మీ రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారు. పిల్లలు కూడా తలదించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. ప్రజలను చైతన్యపరిచే శక్తి కవులకు మాత్రమే ఉంది’’ అంటూ జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. విజయవాడలో  ప్రపంచ రచయితల సంఘం పుస్తకావిష్కరణ సభ సందర్భంగా హైకోర్టు జడ్జి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. 

ఏం సాధించాం 

సామాన్యులను చైతన్య పరిచే గొప్ప మేధాశక్తి రచయితల సొంతమని హైకోర్టు జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. విజయవాడలో ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమృతభారతి’ పుస్తకావిష్కరణ  కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన తర్వాత తెలుగువాళ్ల పరిస్థితి ఏంటో ఒకసారి పునరాలోచన చేసుకోవాలని జస్టిస్ దేవానంద్ అన్నారు. గొప్పగా చెప్పుకోవచ్చుగానీ, ఏం సాధించామని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకొనే పరిస్థితి లేదన్నారు.  

రాజధాని వివాదం 

ఏపీలో మూడు రాజధానుల వివాదం నెలకొంది. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ప్రతిపాదించింది. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి సుమారు 35 వేల ఎకరాల భూసేకరణ చేపట్టింది. అయితే 2019 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న వైసీపీ... మూడు రాజధానులు చేస్తామని ప్రకటించింది. అమరావతి శాసనస రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ప్రకటించింది. అందుకుగాను వికేంద్రీకరణ చట్టం తీసుకొచ్చింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వివాదం మరింత ముదిరింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టు తీర్పు  

 అమరావతికి భూములిచ్చిన రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు మార్చి మూడో తేదీన స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏపీ మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని రైతులకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలను ఇచ్చింది. భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఈ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి పనులన్ని పూర్తి చేయాలని తీర్పును వెలువరించింది. హైకోర్టు మూడు రాజధానులు, పాటు సీఆర్డీఏ చట్టం పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం  తుది తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాదాపుగా ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

Also Read : Three Capitals Supreme Court : మూడు రాజధానుల రాజకీయ క్రీడకు క్లైమాక్స్ - "సుప్రీమే" ఫైనల్ !'

Published at : 18 Sep 2022 04:19 PM (IST) Tags: AP News AP Capital issue AP High Court Vijayawada News Judge justice Battu Devanand

సంబంధిత కథనాలు

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

Anantapur News: పోలీసులకు రక్షణ కల్పించాలంటూ ఏఆర్ కానిస్టేబుల్ సైకిల్ యాత్ర, అరెస్ట్ చేసిన పోలీసులు!

Anantapur News: పోలీసులకు రక్షణ కల్పించాలంటూ ఏఆర్ కానిస్టేబుల్ సైకిల్ యాత్ర, అరెస్ట్ చేసిన పోలీసులు!

Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన గడువు పెంపు, ఎన్ని రోజులంటే?

Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన గడువు పెంపు, ఎన్ని రోజులంటే?

CM Jagan : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్, పట్టువస్త్రాలు సమర్పణ

CM Jagan : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్, పట్టువస్త్రాలు సమర్పణ

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

TS Police Exam: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, కటాఫ్‌ మార్కులు తగ్గాయోచ్!! కొత్త కటాఫ్ ఇదే!

TS Police Exam: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, కటాఫ్‌ మార్కులు తగ్గాయోచ్!! కొత్త కటాఫ్ ఇదే!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!