News
News
వీడియోలు ఆటలు
X

Undavalli On RamojiRao : మార్గదర్శి డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలి - రామోజీరావుకు ఉండవల్లి డిమాండ్ !

మార్గదర్శి డిపాజిటర్ల వివరాలు బయట పెట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

Undavalli On RamojiRao :    మార్గదర్శి చిట్స్ వ్యాపారంలో అనేక నిబంధనలను ఉల్లంఘించిందని, ఇప్పుడు అవే అక్రమాలు బయటపడుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం  రాజమండ్రిలో  మార్గదర్శి వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించిందనే విషయాన్ని తాను ఏనాడో చెప్పానని నష్టాల్లో నడుస్తోందని కూడా చెప్పానని దానిపై ఆ సంస్థ ద్వారా తప్పులు బయ టకు తీసినందుకు తనపై రామోజీరావు కేసులు పెట్టించారని ఆరోపించారు.   ప్రస్తుతం ఏపీ సీఐడీ విచారణలో అందుకు తగ్గట్లే చిట్ అక్రమాలు జరిగినట్లు ఇప్పుడు తేలుతోందన్నారు. 

మార్గదర్శిని రామోజీ తన ఇష్టమొచ్చినట్లు నడిపిస్తూ డిపాజిటర్ల సొమ్మును సొంత వ్యాపారాలకు వినియోగిస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు.  చిట్ ఫండ్ వ్యాపారం చేసేవారు వేరే వ్యాపారాలు చేయకూడదని ఉండవల్లి స్పష్టం చేశారు. బ్రహ్మయ్య అండ్ కంపెనీకి చెందిన సీఏను అరెస్ట్ చేస్తే. అది అందరు సీఏలపై దాడి ఎలా అవుతుందని ప్రశ్నించారు.  తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు.  చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఉండవల్లి  స్పష్టం చేశారు.  రామోజీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అంతా సమానమేనన్నారు. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామికే రూ.10 కోట్లు ఫైన్ వేశారని వెంకటేశ్వరస్వామి కంటే కూడా అతీతుడిననీ రామోజీ అనుకుంటారని కానీ, విజయ్ మాల్యా, రామోజీ రావు ఈ ఇద్దరూ చేసింది ఒక్కటే అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.                  

సెక్షన్ 477 - ఏ ప్రకారం అకౌంట్స్ తారుమారు చేస్తే శిక్ష తప్పదని స్పష్టం చేశారు.  రామోజీరావుకు పారదర్శకత ఉంటే.. డిపాజిటర్ల పేర్లు విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే.. రామోజీరావు పత్రికాస్వేచ్ఛపై దాడి అని చెప్పుకుంటారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇండివిడ్యువల్‌ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్‌ సమర్పించలేదని, బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి అందజేయలేదని అధికారులు తెలిపారు. మూడు నెలలుగా మార్గదర్శికి చెందిన 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను నిలిపివేశారని తెలిపారు. డిసెంబర్‌ నుంచి ఈ ఫారం నింపి ఇవ్వలేదని సీఐడీ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు.                             

మొత్తం మూడు చట్టాల  కింద కేసులు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్  34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982  లోని సెక్షన్   76,79 ప్రకారం  ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. రామోజీరావును ఆయన ఇంట్లో సోమవారం సీఐడీ అధికారులు ప్రశ్నించారు.                        

Published at : 04 Apr 2023 05:03 PM (IST) Tags: Undavalli Arun Kumar margadarsi case

సంబంధిత కథనాలు

APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న

APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు -  నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Tirumala News: తిరుమలలో ఆ వాహనాలు నిషేధం, అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య కీలక ప్రకటన

Tirumala News: తిరుమలలో ఆ వాహనాలు నిషేధం, అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య కీలక ప్రకటన

GVL : ప్రధాని మోదీ విశ్వగురు - ఇప్పుడు భారత్ టాప్ 5 దేశం - గుంటూరులో జీవిఎల్ వ్యాఖ్యలు !

GVL : ప్రధాని మోదీ విశ్వగురు - ఇప్పుడు భారత్ టాప్ 5 దేశం - గుంటూరులో జీవిఎల్ వ్యాఖ్యలు  !

Ganta Srinivasa Rao: ఏపీ అరాచకంలో అఫ్గాన్, అప్పుల్లో శ్రీలంకను దాటేసింది! అసలు సినిమా ముందుంది - గంటా

Ganta Srinivasa Rao: ఏపీ అరాచకంలో అఫ్గాన్, అప్పుల్లో శ్రీలంకను దాటేసింది! అసలు సినిమా ముందుంది - గంటా

టాప్ స్టోరీస్

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?