అన్వేషించండి

Ukraine Telugu Students: ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మరో 28 మంది తెలుగు విద్యార్థులు

Ukraine Telugu Students: ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం సహాయ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ 709 మందిని భారత్ కు తరలించారు.

Ukraine Telugu Students: ఉక్రెయిన్ లో భీకర యుద్ధం జరుగుతోంది. అన్ని వైపుల నుంచి రష్యా(Russia) దాడులు చేస్తుంది. సైనిక చర్యగా రష్యా చెబుతున్నా పౌరులపై కూడా దాడి జరుగుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. అయితే ఈ సంక్షోభంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు(Indian Students) తరలించడం సాహసోపేతమైన చర్య. ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేసింది. విమానాల రాకపోకలకు అవకాశం లేదు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. భారత త్రివర్ణ పతాకంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వస్తే అక్కడ నుంచి దేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ విధంగా శనివారం 219 మందితో తొలి విమానం ముంబయి చేరింది. రొమేనియా నుంచి 250 మందితో, బుడాపెస్ట్ నుంచి 240 మందితో మరో రెండు విమానాలు దిల్లీకి చేరాయి. ఇప్పటి వరకూ 709 మంది భారతీయ విద్యార్థులు దేశానికి చేరుకున్నారు. 

విద్యార్థులను ఉచితంగా తీసుకువచ్చేందుకు చర్యలు 

ఉక్రెయిన్‌(Ukraine) నుంచి రొమేనియా చేరుకున్న వారిలో కొంత మందిని దేశానికి తీసుకొచ్చారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 28 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 17 మంది తెలంగాణ విద్యార్థులు ఆదివారం దిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వారిని ఉచితంగా తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఏపీకి చెందిన 11 మంది విద్యార్థులు కూడా ఉక్రెయిన్ నుంచి దిల్లీ చేరుకున్నారు. వారిని రాష్ట్ర అధికారులు ఏపీ భవన్‌(AP Bhavan)కు తీసుకెళ్లారు. ఏపీ భవన్‌లో ఉన్న 11 మంది విద్యార్థులు తమ స్వస్థలాకు చేరుకుంటున్నారు. నిన్న ముంబయి(Mumbai)కి 20 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేరుకున్నారు. దిల్లీ(Delhi)లో ఇరు రాష్ట్రాలు విద్యార్థుల కోసం హెల్ఫ్ డెస్క్ లు ఏర్పాటు చేశాయి. 

ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు మరవలేం : విద్యార్థులు

తూర్పు గోదావరి జిల్లా మధురపూడి ఎయిర్ పోర్టుకు ఉక్రెయిన్ లో మెడిసిన్(Medicine) చదువుతున్న విద్యార్థినులు చేరుకున్నారు. సుష్మా, సుదర్శనలను ఎయిర్ పోర్టులో కుటుంబ సభ్యులు రిసీవ్ చేసుకున్నారు. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్నామని అక్కడ యుద్ధం ప్రభావం అంతగా లేదని విద్యార్థినులు చెప్పారు. ఈస్ట్రన్ ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుందన్నారు. యూనివర్సిటీ రుమేనియా బోర్డర్ కు దగ్గర ఉండటంతో త్వరగా రాగలిగామన్నారు. ఇంకా 15 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో ఉండిపోయారన్నారు. సైరెన్ మోగినప్పుడు మెట్రో స్టేషన్, బంకర్స్ లో తలదాచుకున్నామని తెలిపారు. అక్కడ పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయని విద్యార్థినులు చెప్పారు. ఉక్రెయిన్ లో చిక్కుక్కున్న విద్యార్థులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు వేగంగా జరగాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు మరువలేమన్నారు. ఉక్రెయిన్ నుంచి ముంబయి చేరుకున్న విద్యార్థులు వయా బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం రేణిగుంట(Renigunta) విమానాశ్రయానికి చేరుకున్న నవీన్ కు అధికారులు స్వాగతం పలికారు. మరి కొందరు విద్యార్థులు సాయంత్రం లోపు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు

టాప్ హెడ్ లైన్స్

AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
Embed widget