అన్వేషించండి

Dadisetti On Yanamala : నీ ఊర్లో స్కూల్ కు తీసుకెళ్లి చెప్పుతో కొడతా, యనమలపై దాడిశెట్టి రాజా తీవ్ర వ్యాఖ్యలు

Dadisetti On Yanamala : టీడీపీ సీనియర్ నేత యనమలపై మంత్రి దాడిశెట్టి రాజా ఓ రేంజ్ ఫైర్ అయ్యారు. తనతో వస్తే నియోజకవర్గంలోని స్కూళ్లలో నాడు-నేడు పనులు చూపిస్తానన్నారు.

Dadisetti On Yanamala : టీడీపీ నేత యనమలపై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. కాకినాడ జిల్లా తుని మండలంలోని తన నివాసంలో మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. యనమల రామకృష్ణుడు తన స్వగ్రామంలో కనీసం హైస్కూల్ కూడా కట్టించలేదని విమర్శించారు. యనమలకు జ్ఞానోదయం కలిగిస్తే అప్పుడు  హైస్కూల్ కట్టించారని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో నారా లోకేశ్ బఫూన్ గా తయారయ్యారన్నారు. టీడీపీలో నెంబర్ టుగా ఉన్న యనమలను దాటి అచ్చెన్నాయుడు సీఎం అవ్వాలని చూస్తున్నారన్నారు. యనమలది ఎన్టీఆర్ ను  వెన్నుపోటు పొడిచిన చరిత్ర అని ఆరోపించారు.  చంద్రబాబు  ముసలోడు అయ్యాడు కాబట్టి వెన్నుపోటు పొడిచి సీఎం పదవికి ట్రై చెయ్ అని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో వ్యాపారాల పైన, పరిశ్రమల పైన పెట్టుబడులు పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి విద్య వ్యవస్థపై  రూ. 60 వేల కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. యనమల తప్పుడు కూతలు కూస్తే ఇంటికి వచ్చి నీ చెయ్యి పట్టుకుని మీ ఊళ్లో ఉన్న స్కూలుకి తీసుకెళ్లి చూపించి చెప్పు తీసి కొడతానని మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

యనమల వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు 

యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు.  ఏపీ విద్యా విధానాలను కేంద్రం బడ్జెట్‌లో ప్రస్తావించిందన్నారు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలకు రాష్ట్రానికి గుర్తింపు లభించిందన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న ఏకైక సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో కనీసం టాయిలెట్లు కూడా లేవని విమర్శించారు. నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఆ విషయాలు తెలుసుకోవాలన్నారు. యనమల స్వగ్రామంలో  నాడు-నేడు కింద పనులు జరుగుతున్నాయన్నారు. యనమల ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని మంత్రి దాడిశెట్టి రాజా హితవు పలికారు. యనమల వస్తే నియోజకవర్గంలో పాఠశాలలకు తీసుకెళ్తానన్నారు. హైస్కూల్‌ కడితే తన పొలాల్లో పనిచేసేందుకు ఎవరు రారని స్వగ్రామంలో హైస్కూల్ కట్టించలేదని యనమలను విమర్శించారు. అలాంటి ఆయన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి రాజా విమర్శించారు.  

చెప్పుతో కొడతా

"2014లో మీ ఊరి ప్రజలందరూ హైస్కూల్ కోసం మీ వద్దకు వస్తే... మీరన్న మాటలు గుర్తుందా? హైస్కూల్ గ్రాంట్ చేస్తే మన పొలాల్లో పనిచేయడానికి ఎవరుంటారు అన్నారు.  ఈ విషయంపై నేను పోరాటం చేస్తే అప్పుడు హైస్కూల్ గ్రాంట్ చేశారు. అయినా హైస్కూల్ కు బిల్డింగ్ లేదు. కళ్యాణమండపంలో పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాడు-నేడులో భాగంగా హైస్కూల్ భవనాలు కట్టారు. అలాంటి వ్యక్తి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అయింది. ఇప్పుడు అచ్చెన్నాయుడు నెంబర్ టు ప్లేస్ లోకి వచ్చారు. ఆ ప్లేస్ కోసం ట్రై చేసుకో అంతే కానీ విద్యా వ్యవస్థపై విమర్శలు చేస్తే ఊరుకోం. ఎవరైనా పెట్టుబడులు వ్యాపారాలపై పెడతారు కానీ సీఎం జగన్ పిల్లల భవిష్యత్ పై పెట్టుబడి పెట్టారు. యనమల ఇలాగే మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాను." - మంత్రి దాడిశెట్టి రాజా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
Embed widget