అన్వేషించండి

TTD Website: శ్రీవారి భక్తులకు అలెర్ట్, టీటీడీ వెబ్‌సైట్ మార్పు, ఇకపై ఇదే ఒరిజినల్

TTD Website: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి చెందిన వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను https://ttdevasthanams.ap.gov.in గా మార్చుతున్నట్లు ప్రకటించింది.

TTD Website: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి చెందిన వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను https://ttdevasthanams.ap.gov.in గా మార్చుతున్నట్లు ప్రకటించింది. ఒకే సంస్థ, ఒకే వెబ్‌సైట్, ఒకే మొబైల్ యాప్ అన్న నినాదం మేరకు వెబ్సైట్ పేరును https://ttdevasthanams.ap.gov.in గా మార్చినట్లు ఐటీ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి సోమవారం తెలిపారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. టీటీడీ ఐటీ విభాగం ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందించడం ద్వారా శ్రీవారి భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలు, గదులు, లడ్డూ ప్రసాదం తదితర సేవలను వేగంగా, పారదర్శకంగా అందిస్తోందని అన్నారు.

బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా వెహికల్ పాస్ మేనేజ్‌మెంట్ సిస్టం అప్లికేషన్ రూపొందించి తిరుపతి శివారు ప్రాంతాల్లో వాహనాలకు పాసులు మంజూరు చేశామని, దీని ద్వారా తిరుమలలో వాహనాల రద్దీ పెరిగినప్పుడు విజిలెన్స్ అధికారులు తిరుపతిలోనే పార్కింగ్ వసతి కల్పించారని తెలిపారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలను సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాహన సేవలను వీక్షించి తరిస్తున్నారని తెలియజేశారు. 2021వ సంవత్సరం నుంచి టీటీడీ వెబ్‌సైట్, యాప్ క్లౌడ్‌కు మారాయని, అప్పటినుంచి వేగవంతంగా దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్ జరుగుతోందని వివరించారు. 


TTD Website: శ్రీవారి భక్తులకు అలెర్ట్, టీటీడీ వెబ్‌సైట్ మార్పు, ఇకపై ఇదే ఒరిజినల్

ఒకే సంస్థ, ఒకే వెబ్సైట్, ఒకే మొబైల్ యాప్ అన్న నినాదం మేరకు వెబ్సైట్ పేరును మార్చామని వెల్లడించారు. తద్వారా టీటీడీకి సొంతంగా ట్రేడ్ మార్క్ ఉంటుందని, నకిలీ వెబ్సైట్లను నియంత్రించే అవకాశం లభిస్తుందని అన్నారు.  వీటితోపాటు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, తిరుమలలో పారదర్శకంగా గదులు కేటాయించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్జితసేవల ఆన్లైన్ లక్కీ డిప్‌తో పాటు తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయంలో ఆఫ్ లై‌న్‌లో ఎలక్ట్రానిక్ డిప్ అమలు చేస్తున్నామని చెప్పారు. టీటీడీ విద్యాసంస్థల్లో స్టూడెంట్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. 

స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్ ద్వారా మెరుగైన పాలన జరుగుతోందన్నారు. త్వరలో టీటీడీ పరిధిలోని 60 స్థానిక ఆలయాల్లో భక్తులు ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే  అవకాశం కల్పిస్తామన్నారు. శ్రీవారి సేవ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా సేవకులు నమోదు చేసుకుంటున్నారని చెప్పారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి డిప్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మేనేజర్లు నాదముని, నాగరాజరెడ్డి పాల్గొన్నారు.

గతంలో టీటీడీ అధికార వెబ్‌సైట్‌గా https://tirupatibalaji.ap.gov.in/ గా ఉండేది. దీని ద్వారానే భక్తులు, సేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకునేవారు. దీని స్థానంలో టీటీడీ కొత్త యూఆర్ఎల్‌ను పరిచయం చేసింది. టీటీడీకి సంబంధించిన అన్ని విషయాలకు https://ttdevasthanams.ap.gov.in సందర్శించాలని శ్రీవారి భక్తులను కోరింది. సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో టీటీడీని పోలిన వెబ్‌సైట్లు చాలా ఉన్నాయని, అలాంటి నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని సూచించింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Rayalaseema Movement: వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రత్యేక రాయలసీమ వాదం - ఏపీ రాజకీయాల్లో విభజన ఉద్యమం ప్రారంభం కానుందా?
వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రత్యేక రాయలసీమ వాదం - ఏపీ రాజకీయాల్లో విభజన ఉద్యమం ప్రారంభం కానుందా?
Sita Navami 2026: కవిత పార్టీ ఆవిర్భావం రోజైన సీతానవమి సందర్భంగా చదవాల్సిన పాప విముక్తి గాథ!
కవిత పార్టీ ఆవిర్భావం రోజైన సీతానవమి సందర్భంగా చదవాల్సిన పాప విముక్తి గాథ!
TDP MLA Thomas: మేము బానిసలుగా ఉండాలా? - సొంత పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే థామస్ నిప్పులు
మేము బానిసలుగా ఉండాలా? - సొంత పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే థామస్ నిప్పులు
AP Assembly Sessions: మరోసారి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు - సీక్రెట్ ఎజెండా ఉందా?
మరోసారి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు - సీక్రెట్ ఎజెండా ఉందా?

వీడియోలు

MI Batting Line Up vs CSK IPL 2026 | ముంబై బ్యాటర్ల ఘోర వైఫల్యం
IPL 2026 MI vs CSK Akeal Hosein | వాంఖడేలో అకీల్ హోసెన్ స్పిన్ సునామీ
MI vs CSK Highlights IPL 2026 | ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ విక్టరీ
Sanju Samson Century vs MI IPL 2026 | ఒక సెంచరీతో రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ
RR vs LSG IPL 2026 Highlights | లక్నోకు వరుసగా 4వ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petro rates: పెట్రోలు ధరల పెంపు లేదంటున్న కేంద్రం - ఏప్రిల్ 29 తర్వాత పెంచకుండా ఉండగలరా?
పెట్రోలు ధరల పెంపు లేదంటున్న కేంద్రం - ఏప్రిల్ 29 తర్వాత పెంచకుండా ఉండగలరా?
Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మె విరమణ! ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం, 11 శాతం ఫిట్‌మెంట్‌కు సర్కారు ఓకే!
తెలంగాణ ఆర్టీసీ సమ్మె విరమణ! ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం, 11 శాతం ఫిట్‌మెంట్‌కు సర్కారు ఓకే!
Sita Navami 2026: కవిత పార్టీ ఆవిర్భావం రోజైన సీతానవమి సందర్భంగా చదవాల్సిన పాప విముక్తి గాథ!
కవిత పార్టీ ఆవిర్భావం రోజైన సీతానవమి సందర్భంగా చదవాల్సిన పాప విముక్తి గాథ!
Varanasi Update : మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాలపై సాంగ్ - ఫోటోస్ ఫ్రమ్ వారణాసి
మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాలపై సాంగ్ - ఫోటోస్ ఫ్రమ్ వారణాసి
2026లో వట సావిత్రి వ్రతం ఎప్పుడు? తేదీ, శుభ సమయం , పూజా విధానం తెలుసుకోండి!
2026లో వట సావిత్రి వ్రతం ఎప్పుడు? తేదీ, శుభ సమయం , పూజా విధానం తెలుసుకోండి!
Virat Kohli Scripts History in IPL 2026: కోహ్లీ రికార్డుల జాతర - ఒకే ఒక్కడు.. 800 బౌండరీలు బాదిన మొదటి ప్లేయర్.. సింగిల్ టీమ్ తరపున 300 సిక్సర్ల రికార్డ్!
కోహ్లీ రికార్డుల జాతర - ఒకే ఒక్కడు.. 800 బౌండరీలు బాదిన మొదటి ప్లేయర్.. సింగిల్ టీమ్ తరపున 300 సిక్సర్ల రికార్డ్!
IPL 2026 RCB VS GT Result Update: ఆర్సీబీ పాంచ్ ప‌టాకా.. ఐదో విజ‌యంతో టాప్-2కి చేరిన ప‌టిదార్ సేన‌.. రాణించిన కోహ్లీ, ప‌డిక్క‌ల్, గుజ‌రాత్ కు నిరాశ‌
ఆర్సీబీ పాంచ్ ప‌టాకా.. ఐదో విజ‌యంతో టాప్-2కి చేరిన ప‌టిదార్ సేన‌.. రాణించిన కోహ్లీ, ప‌డిక్క‌ల్, గుజ‌రాత్ కు నిరాశ‌
TDP MLA Thomas: మేము బానిసలుగా ఉండాలా? - సొంత పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే థామస్ నిప్పులు
మేము బానిసలుగా ఉండాలా? - సొంత పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే థామస్ నిప్పులు
Embed widget