అన్వేషించండి

Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Andhra Pradesh Rains | నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిడుగులతో కూడిన వర్షాలు, వడగాల్పులు ఆంధ్రప్రదేశ్‌ను హెచ్చరించాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు, రుతుపవనాలు తెలంగాణ ప్రవేశం.
  • తెలంగాణలో వర్షాలు, ఈ ఏడాది వర్షపాతం లోటు అంచనా.

అమరావతి: కర్ణాటక పరిసర ప్రాంతాల నుండి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారనుంది. సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిల్చోవద్దని ప్రజలకు సూచించారు.

కొన్ని చోట్ల వడగాల్పులు
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం ప్రకాశం జిల్లా కరేడులో అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు పిడుగులు, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఇంకా తగ్గని భానుడి ప్రతాపం.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నేడు 42 నుంచి 44 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రత నమోదు కానుంది. కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అత్యవసరంగా బయటకు వెళ్తే చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా కండువా లేదా టోపీ ధరించాలని ప్రజలకు సూచించారు. ​

Also Read: School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ

రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురవడంతో వాతావరణం కూల్‌గా మారింది. నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం వనపర్తి జిల్లా ఏదుల మండలంలో గరిష్టంగా 5.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
తెలంగాణలో నేడు మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కూడా భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, కందుకూర్, యాచారం బెల్ట్ మీదుగా కడ్తాల్, కేశంపేట, ఆమనగల్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. 

50% సాధారణ వర్షాలు - 50% లోటు వర్షాలు
ఈ ఏడాది వర్షపాతం 2018 నాటి పరిస్థితులను పోలి ఉంటుందని, సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాది (2025) కురిసిన భారీ వర్షాలను ఈసారి అస్సలు ఆశించలేమని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నెలల వారీగా వర్షాల గమనాన్ని పరిశీలిస్తే.. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. 

అయినప్పటికీ, ఈ ఏడాది వర్షాలు 2014-15 నాటి కరువు పరిస్థితుల వలె మరీ దారుణంగా ఉండకపోవచ్చని, కానీ గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాల వర్షపాతం  తగ్గుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది లోటు వర్షాల ప్రభావం తెలంగాణలోని దక్షిణాది, ఉత్తరాది జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది సాధారణం నుండి స్వల్పంగా లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఎప్పుడు కురుస్తాయి?

కర్ణాటక ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉంటాయి.

ఏపీలో పిడుగుల వర్షాల ముప్పు ఉన్న జిల్లాలు ఏవి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిల్చోవద్దు.

ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత ఎలా ఉంది?

రాష్ట్రవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. అత్యవసరంగా బయటకు వెళ్తే కండువా లేదా టోపీ ధరించాలి.

తెలంగాణలో రుతుపవనాల పరిస్థితి ఎలా ఉంటుంది?

నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయి. జూన్, జూలైలలో సాధారణ వర్షపాతం, ఆగస్టు, సెప్టెంబర్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు అంచనా.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విశాఖ అక్కిరెడ్డిపాలెం వద్ద మంటల్లో లారీ దగ్ధం.. రెండు గంటలు ట్రాఫిక్ జామ్
విశాఖ అక్కిరెడ్డిపాలెం వద్ద మంటల్లో లారీ దగ్ధం.. రెండు గంటలు ట్రాఫిక్ జామ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Embed widget