By: ABP Desam | Updated at : 30 Jun 2023 04:46 PM (IST)
మదనపల్లె మార్కెట్లో టమాటా రికార్డు ధర (Image: PTI)
Tomato Price Hike: మదనపల్లె: గత కొన్ని రోజులుగా మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. ఇటీవల కర్ణాటక మార్కెట్ లో వంద రూపాయలు దాటిన కేజీ టమాటా ధర తాజాగా ఏపీలో మంట పెడుతోంది. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్లో కేజీ టమాటా రికార్డు స్థాయిలో రూ.124కు చేరింది. పది రోజుల నుంచి టమాటా ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.
గత వారం దక్షిణాది రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర రూ.15 నుంచి రూ.30 మధ్య ఉండేది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పంటల దిగుబడి పెరగలేదు. మరోవైపు జూన్ మూడో వారం వరకు ఎండలు ఉండటంతో ఉత్పత్తి తగ్గింది. ఈ క్రమంలో నాలుగైదు రోజుల కిందట హోల్‌సేల్ APMC మార్కెట్‌లో 15 కిలోల టమాటా రూ. 1,100 ధర పలికింది. హోల్ సేల్ ధర ఇంతలా ఉందంటే.. కేజీ చిల్లర ధర రూ.80కి చేరుకుంది. రిటైల్ మార్కెట్‌లో కొన్ని చోట్ల నాణ్యత లేని టమాటాను సైతం ఇదే ధరలకు విక్రయిస్తున్నారు. ఈ బిజినెస్ కు సంబంధం ఉన్న ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. త్వరలోనే 1 కేజీ టమాటా ధర రూ.100 మార్కు దాటుతుందని అంచనా వేశారు.
మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కు దాదాపు 1500 టన్నుల వరకు టమాటా వచ్చేది. నేడు మార్కెట్ కు ఇందులో సగం మాత్రమే రావడంతో.. ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ఏ గ్రేడ్ రకం టమాటా కిలో రూ.106 నుంచి రూ.124 వరకు ధర పలికింది. బీ గ్రేడ్ రూ.86 నుంచి రూ.105 మధ్య ఉండగా.. ఓవరాల్ గా చూస్తే కేజీ రూ.100 మీద టమాటా ధర పలికిందని స్థానిక మార్కెట్ కు చెందిన వారు తెలిపారు. కర్ణాకక మార్కెట్ తో పాటు మదనపల్లె మార్కెట్ నుంచి ఉత్తరాధి రాష్ట్రాలకు టమాటా భారీ ఎత్తున సరఫరా అవుతుందని తెలిసిందే.
గత ఏడాది కేజీ టమాటా రూ.5..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలోని మార్కెట్ లో కిలో టమోటా కనిష్ట ధరలు నమోదు చేసింది. ప్రస్తుతం కేజీ రూ.120 పైగా నమోదు చేస్తున్న టమాటా, గత ఏడాది జులై నెలలో ఓ దశలో కిలో రూ. 5కి పడిపోయింది. కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన చెందారు. మరికొందరు రైతులు రవాణా ఖర్చులు కూడా రావు అని, రోడ్లపై టమాటాలు కుప్పలుకుప్పలుగా పడేశారు.
ఓవైపు మహారాష్ట్రలో పంట నష్టం జరిగింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయడంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది సాధారణం కంటే 30 శాతం పంట దిగుబడి తక్కువగా ఉందని కోలార్ కు చెందిన రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే టమాటా ధరలు చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఒకేసారి భారీగా టమాటా దిగుబడి రావడం, సాగు కూడా అధిక మొత్తంలో ఉండటంతో గతేడాది కేజీ టమాటా రూ.5కు పడిపోయింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Visakha News: వెయ్యి మంది మహిళలతో నారీ శక్తి సమ్మేళనం - అక్టోబర్ 1న ముహూర్తం ఫిక్స్
Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ
Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
Top Headlines Today: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు! - డీకే శివకుమార్‌ను కలిసిన మోత్కుపల్లి
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
/body>