అన్వేషించండి

Tirumala Srinivasa Kalyanam: యూకేలో శ్రీనివాస కల్యాణంపై భక్తులకు టీటీడీ సంచలన ప్రకటన- చర్యలకు విజిలెన్స్ శాఖకు ఆదేశం 

Tirumala Srinivasa Kalyanam: శ్రీనివాసుడి పేరుతో దోపిడీకి సిద్ధమవుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. ముఖ్యంగా యూకేలో స్వామి పేరుతో జరుగుతున్న ప్రచారంపై కీలక ప్రకటన విడుదల చేసింది

Tirumala Srinivasa Kalyanam: విదేశాలలో శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార నకిలీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం టిటిడి హెచ్చరించింది. యూకే లోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో అనధికారిక శ్రీనివాస కల్యాణానికి సిద్ధమైంది. ఈ నెలలోనే భారీ స్థాయిలో కల్యాణం నిర్వహిస్తామని ప్రచారం చేసింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీని కోసం డబ్బులు వసూలు చేయడంపై చాలా మంది భక్తులు టీటీడీకి ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు. 

సెప్టెంబర్‌ ఆరో తేదీన యూనైటెడ్ కింగ్డమ్‌లోని Slough SL 1 3 LW వద్ద Singh Sabha Slough Sports Centreలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికను వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ చేశారు.

సదరు శ్రీనివాస కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ఏపీఎన్ఆర్టీఎస్ నుంచి ఎలాంటి అనుమతి లేదు. టిటిడి కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినప్పటికీ ఆహ్వాన పత్రికలో టిటిడికి చెందిన లోగోను వాడారు. టిటిడి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఒక విధంగా భక్తులను తప్పుదారి పట్టిస్తూ గందరగోళానికి గురిచేయడమే. అంతేకాక ఆహ్వాన పత్రికలో ఉచితం అని పేర్కొన్నప్పటికీ ప్రత్యేక సేవలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు. 

భక్తుల నుంచి సేవా ఫీజుల పేరుతో వసూళ్లు చేసే  చేస్తున్నారు. ముఖ్యంగా, ఆహ్వాన పత్రంపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే భక్తుల రిజిస్ట్రేషన్ వివరాలతోపాటు సేవా ఫీజు (£ 566 పౌండ్లు) వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం కనిపించింది. డబ్బులు వసూలు చేసే అంశంతోపాటు టిటిడి కల్యాణ లడ్డూ ప్రసాదం, ఒక వెండి లాకెట్, ఒక నవరమ్ వేద వస్త్రం, అక్షింతలు, పసుపు, అమ్మవారి కుంకుమ, చీర, మంగళ్యం ధారం, జాకెట్టు, వేంకటేశ్వర స్వామి వారి ఫోటో ఫ్రేమ్ ఉన్నాయి. సదరు నకిలీ శ్రీనివాస కల్యాణ మహోత్సవంపై ఫిర్యాదు రావడంతో చర్యలకు విజిలెన్స్ శాఖను టిటిడి ఆదేశించింది.

భక్తులను గందరగోళానికి గురిచేసే అనధికార కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని టిటిడి సూచించింది. టిటిడి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా టిటిడి పేరుతో శ్రీనివాస కల్యాణ మహోత్సవం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నకిలీ కల్యాణోత్సవాల పేరుతో ఎవరైనా సమాచారాన్ని వైరల్ చేసి డబ్బులు కోరితే టిటిడి విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకురావాలని కోరుతోంది.

టాప్ హెడ్ లైన్స్

AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget