అన్వేషించండి

Tirumala Updates: శ్రీవారి భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల - దర్శనానికి ఎంత టైమ్ పడుతుందంటే

Heavy Rush In Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా గత రెండు నెలల నుంచి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Heavy Rush In Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా గత రెండు నెలల నుంచి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబాలతో పాటు భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునేందకు భక్తులకు ఒకరోజు సమయం పడుతుంది. స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న వారికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

నిన్న సైతం భారీగానే ఆదాయం..  
శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనార్థం క్యూ లైన్లలో భక్తులు ఉన్నారు. కంపార్ట్ మెంట్ల వెలుపల ఆస్థాన మండపం వరకు భక్తులు శ్రీవారి దర్శనార్థం ఎదురుచూస్తున్నారు. దాంతో స్వామివారి దర్శనానికి ప్రస్తుతం భక్తుకు 24 గంటల సమయం పడుతోంది. జూలై 9న స్వామివారిని 87,478 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 48,692 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజు తిరుమలలో శ్రీవారి హుండీకి రూ.4.53 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..  శ్రీవారి భక్తులకు టీటీడీ అప్‌డేట్ ఇచ్చింది. తిరుమలలో ఒక్కరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో జూలై 11న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. జూలై 17 న ఆదివారం అస్థానం సందర్బంగా తిరుమల శ్రీ‌వారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా జూలై 12న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేయడం జరిగిందని, ఈ కారణంగా జూలై 11న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

షెడ్యూల్ ప్రకారం టికెట్లు విడుదల..
జూన్ 6న ఉదయం 9 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈ మంగళవారం నాడు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం భక్తులకు ఈ నెల 12, 15, 17 తేదీలలో స్వామివారిని దర్శించుకునేందుకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను దేవస్థానం నేడు విడుదల చేసింది. రూ.300 టికెట్ల స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేసినట్లు టీటీటీ అధికారులు తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.
Also Read: Tirumala : గోఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, మార్క్ ఫెడ్ తో టీటీడీ ఒప్పందం

కరోనా తరువాత హుండీకి భారీ ఆదాయం
2018 జూలై 26న రికార్డు స్థాయిలో రూ.6.28 కోట్ల కానుకలు శ్రీవారి హుండీకి వచ్చాయి. ఆ తరువాత దాదాపు మూడేళ్లకు దాదాపుగా అదే స్థాయిలో హుండీకి కానుకలు చేరాయి. సోమవారంనాడు రికార్డు స్థాయిలో రూ. 6.18 కోట్ల కానుకలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో రెండోసారి 6 కోట్ల రూపాయలు పైగా కానుకలు హుండీలో సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget