Srivari Temple Karimnagar: కరీంనగర్ లో శ్రీవారి ఆలయం నిర్మిస్తాం - వెల్లడించిన టీటీడీ ఈఓ
Srivari Temple Karimnagar: కరీంనగర్ లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
Venkateswara Swamy Temple Karimnagar: త్వరలోనే కరీంనగర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు టీటీడీ ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.09 లక్షల మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రూ.39.4 కోట్ల హుండీ ఆదాయం నెలకొన్నట్లు వివరించారు. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. 2022లో మొత్తం 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే రూ.1,450 కోట్ల హుండీ ఆదాయం లభించిందని ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
టీటీడీపై దుష్ప్రచారం చేయొద్దు: ఈఓ ధర్మారెడ్డి
ఈనెల 28వ తేదీన రథసప్తమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని ఆలయ ఈఓ ధర్మారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తిరుమల అద్దె గదుల ధరలు పెంచారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడం చాలా బాధాకరం అన్నారు. తిరుమలలో 7500 గదులు ఉన్నాయని, వీటితోపాటు యాత్రికులు ఉచిత సముదాయాలు నాలుగు ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు సంబంధించిన ఉచితంగా ఉండటానికి లాకర్లు, బోజనం, స్నానపు గదులు ఉన్నాయి. రూ.50, రూ.100 అద్దె గదులు 5 వేల వరకు ఉన్నాయని చెప్పారు. గత 40 సంవత్సరాలుగా అదే అద్దె ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 116 కోట్లు తో ఆధునికీకరణ చేశాం. 50 రూపాయలు గది ప్రైవేట్ హోటల్ ధర 2వేలకు కేటాయిస్తారు. గిజర్ , రూమ్ క్లినింగ్, కరెంట్ బిల్లు అన్ని కలిపి ఖర్చు రూ. 250 అవుతుందన్నారు.
వీటి అద్దె మాత్రమే పెరిగింది..
సామాన్య భక్తులకు కేటాయించే గదలు ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. 1230 గదులకు 1000 రూపాయల ఉంది. ఇవన్నీ నాన్ ఏసి గదులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు ఈ గదులను ఆన్ లైన్ కేటాయిస్తాం. పద్మావతి, ఎంఎబిసీ ప్రాంతంలో సౌకర్యాలు ఎక్కువగా ఉన్న గదుల అద్దె ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో వీఐపీలు అధికంగా వస్తారు. 1344 గదులలో నారాయణ గిరి, ఎస్వీ గెస్ట్ హౌస్ అద్దె పెంచామని క్లారిటీ ఇచ్చారు.
పద్మావతి ప్రాంతంలో ఉన్న విఐపీలకు కేటాయించే గదులను 8 కోట్ల వ్యాయంతో ఆధునీకరణ చేసినా టీటీడీ ఆదాయం కోసం గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. ఏసీ గదులగా ఏర్పాటు చేసి అన్నీ గదులకు సమానంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం అన్నారు. యాత్రికుల ఉచిత సముదాయం 5 కూడా త్వరలో నే సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్నామని చెప్పారు. టీటీడీపై చేస్తున్న విమర్శల్ని ఖండించారు. విమర్శలు చేసే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తిరుమలలో వచ్చి స్వయంగా పరిశీలించవచ్చు అన్నారు.