Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Tirumala Private Vehicles | తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పష్టం చేసింది. రోజుకు కొన్ని వేల వాహనాలకే అనుమతి నిజం లేదని పేర్కొంది.

Private Vehicles Entry to Tirumala | తిరుపతి: తిరుమల క్షేత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక విషయం హాట్ టాపిక్ అవుతోంది. కొన్నిసార్లు లడ్డూ నాణ్యతపై, కొన్నిసార్లు ఏర్పాట్లు, భక్తులకు ప్రసాదాలు అందడం లేదని, కొండ మీద మద్యం, మాంసం ఉంటున్నాయని టీటీడీ నిఘా వైఫల్యమంటూ విమర్శలు వస్తుంటాయి. తాజాగా తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు ఉన్నాయని కొందరు భక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. తిరుమలకు చేరుకునే ప్రైవేటు వాహనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది.
రోజుకు కేవలం 15 వేల వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతిస్తారని, ఆ సంఖ్య దాటిన తర్వాత వచ్చే వాహనాలను చెక్పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పింది. ప్రైవేటు వాహనాల సంఖ్యపై టీటీడీ ఎలాంటి పరిమితులు గానీ, కొత్త నిర్ణయాలు గానీ తీసుకోలేదని ఓ ప్రకటనలో వెల్లడించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వదంతులను, తప్పుడు వార్తలను భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనం, తిరుమల ప్రయాణానికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా కేవలం టీటీడీ అధికారిక ప్రకటనలు, వెబ్సైట్ ద్వారానే నిర్ధారించుకోవాలని భక్తులకు సూచించింది. టీటీడీ పేరుతో భక్తులను గందరగోళానికి గురిచేసేలా తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టపరంగా తీసుకుంటామని ఈ సందర్భంగా టీటీడీ అధికారులు హెచ్చరించారు.
ట్రెండింగ్ వార్తలు























