Chittoor Dairy Restoration: చిత్తూరు డెయిరీ రీఓపెన్ పనులకు సీఎం భూమిపూజ - పదినెలల్లో ప్రాసెస్ స్టార్ట్ !
Chittoor Dairy Restoration: చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించారు.
Chittoor Dairy Restoration: దేశంలోనే రెండో అతి పెద్దదయిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రూ.385 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగానే సీఎం జగన్ మాట్లాడుతూ.. హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్ర పూరితంగా మూసేశారని విమర్శించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, సొంత జిల్లానే నాశనం చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మూత పడిన చిత్తూరు డెయిరీ తెరిపిస్తున్నామని.. చెప్పారు. ఈ సభ అనంతరం సీఎంసీ ఆస్పత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమైంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యూనిట్ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పెరుగు, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ.150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం పార్లర్ ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది.
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా సీఎం శ్రీవైయస్.జగన్ చేతుల మీదుగా జరగనున్న అమూల్ సంస్ధ భూమిపూజ కార్యక్రమానికి హాజరవుతున్న మహిళలు, రైతులు. #CMYSJagan #JaganannaPaalaVelluva #YSJaganRevivesChittoorDairy #APDC pic.twitter.com/YylYYWhG0H
— YSR Congress Party (@YSRCParty) July 4, 2023
సహకార డెయిరీ రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రంలో 3,551 మహిళా పాడి రైతులు సంఘాలకు చెందిన 3.07 లక్షల మంది పాడి రైతుల నుంచి రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలను అమూలు సేకరిస్తోంది. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాలు సేకరించగా.. రూ.393 కోట్లు చెల్లించారు. అమూలు రాకతో గత రెండేళ్లలో పెంచిన పాల సేకరణ ధరల వల్ల ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.4,243 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరింది. మూత పడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నారు. ఇందుకోసం డెయిరీకి రూ.182 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. చిత్తూరులో జరిగినన భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ షమల్ బాయి బి పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ యూనియన్ లిమిటెడ్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాల కృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.