అన్వేషించండి

Skill TDP Website : స్కిల్ కేసు అన్ని డాక్యుమెంట్లు ఆ వెబ్ సైట్లో - టీడీపీ కొత్త ప్రయత్నం

స్కిల్ డెలవప్‌మెంట్‌కు చెందిన అన్ని వివరాలతో టీడీపీ వెబ్ సైట్ ఆవిష్కరించింది. apskilldevelopmenttruth.com ఈ వెబ్ సైట్ లో కేబినెట్ అప్రూవర్ సహా.. ట్రైనింగ్ తీసుకున్న వారందరి పేర్లు ఉన్నాయన్నారు.


Skill TDP Website : ‘స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోఎలాంటి అవినీతి జరగలేదని నిరూపించే వాస్తవాలను ప్రతిరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. చంద్రబాబునాయుడి లాంటి జాతీయ నాయకుడు తప్పుచేయలేదనే వాస్తవం ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే అన్ని ఆధారాలతోకూడిన వాస్తవాలను పబ్లిక్ డొమైల్ పెట్టాలని నిర్ణయించుకున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ‘స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్’ కు సంబంధించి పూర్తి వాస్తవాలతో కూడిన వెబ్ సైట్‌ను  ఆవిష్కరించారు. స్కిల్ స్కామ్ కేసులో ప్రజలకు వాస్తవాలు తెలియ చెప్పడానికే apskilldevelopmenttruth.com వెబ్ సైట్‌ను ప్రారంభించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

వెబ్ సైట్ లోని వివరాలు పరిశీలిస్తే, చంద్రబాబు ఏంచేశారో, యువత భవితకోసం ఎంతగా తపనపడి, ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేశారో, ఈ ప్రభుత్వం ఏవిధంగా దుష్ప్రచారం చేస్తుందో ప్రజలకు తెలుస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని ఉద్దేశ్యంతో వెబ్‌సైట్ ఓపెన్ చేశాం. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు.  ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైంది. కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం కూడా అవార్డులు ఇచ్చింది. 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు. 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయని అచ్చెననాయుడు తెలిపారు.  

వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వాస్తవాలు తెలియజేయాలని వెబ్‌సైట్ తీసుకొచ్చాం. చంద్రబాబు అరెస్ట్‌కు  వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిరసనకు దిగుతున్నారు. రూ.380 కోట్లు అవినీతి జరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.   ఇప్పటి నుంచి వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. సంబంధం లేని కేసులో ఇరికించారు. హైదరాబాద్‌లో.. విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారు. రాష్ట్ర విభజన సమయంలో వచ్చినట్లు రోడ్డుపైకి వస్తున్నారు. జనసేన పార్టీతో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలన్న దానిపై త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జనసేన, టీడీపీ నాయకులు కలిసి ఉమ్మడి పోరాటం చేస్తున్నారని స్పష్టం  చేశారు.  

క్విడ్ ప్రోకో పదాన్ని తెలుగువారికి పరిచయం చేసింది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? ఈ ప్రభుత్వ పతనం మొదలైంది కాబట్టే ఇంతపెద్ద తప్పు చేసింది అని అచ్చెన్నాయుడు అన్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా, చంద్రబాబునాయుడికి, అచ్చెన్నాయుడికి, లోకేశ్ కు ఫలానా వారి నుంచి డబ్బులు వచ్చాయని నిరూపించకుండా నోటికొచ్చినట్టు ఎలా ఆరోపణలు చేస్తారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి పతనం మొదలైంది. కాబట్టే ఇంత తప్పుడు పనికి పాల్పడ్డారు. ప్రజా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపినందుకు ఇంతకింత మూల్యం చెల్లించు కుంటారు అని హెచ్చరించారు.                                                              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Simhachalam Temple: తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Simhachalam Temple: తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
AP GOVT SCHOOLS: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
Embed widget