అన్వేషించండి

Varavararao Bail : వరవరరావుకు ఎట్టకేలకు ఊరట - శాశ్వత మెడికల్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు !

వరవరరావుకు సుప్రీంకోర్టు మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత ఆయనకు ఊరట లభించినట్లయింది.

Varavararao Bail :  వరవరరావు కు సుప్రీంకోర్టు మెడికల్ బెయిల్  మంజూరు చేసింది.  అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ కోరుతూ వరవరరావు పిటిషన్ దాఖలు చేశారు. అయితే వరవర రావు చర్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని, బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని  ఎన్ఐఏ సుప్రీంకోర్టులో వాదించింది. 83 ఏళ్ల వరవరరావు ఈ కేసులో ఇప్పటికే రెండేళ్ల జైలు శిక్ష అనుభవించారని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని, వయస్సు పెరుగుందని ఈ రెండింటితో ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశ ముందని వరవరరావు తరుపు లాయర్‌ నుపుర్‌ కుమార్‌ వాదించారు. వాదోపవాదాల అనంతరం బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.   

ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో అరెస్ట్ 

అనారోగ్యం, వయస్సు , మధ్యంతర బెయిల్ ను దుర్వినియోగం చేయకపోవడం ఆధారంగా శాశ్వత మెడికల్ బెయిల్  మంజూరు చేస్తున్నామని  జస్టిస్ లలిత్ తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో వరవరరావుకు ఊరట లభించినట్లయింది. మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న అభియోగాలతో వరవర రావును 2018 ఆగస్ట్ లో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లను పుణే పోలీసులు నిర్భందించారు. 

అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు 

వరవరరావుపై అత్యంత కఠినమైన UAPA కేసు నమోదు చేశారు. దేశంలో ఇప్పటికే..ఐదుగురి పై మాత్రమే ఈ యాక్ట్ నమోదు చేశారు. ఈ చట్టం కింద కేసులు పెట్టడానికి అరెస్టులు చేయాడనికి.. పోలీసులు ఎలాంటి సాక్ష్యాలను చూపించాల్సిన అవసరం లేదు. ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదు. అందుకే వరవరరావు జైల్లోనే ఉన్నారు. అయితే గత ఏడాది మార్చిలో అనారోగ్య కారణాలతో ఆయనకు  బెయిల్‌ మంజూరు చేసే సమయంలో కోర్టు ముంబయిలోనే ఉండాలని...విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అప్పటి నుండి  తాత్కాలిక బెయిల్ లో ఉన్నారు.

మెడికల్ బెయిల్ లభించడంతో ఊరట

అనారోగ్య కారణాల కారణంగా తనకు శాశ్వత బెయిల్ కావాలని ఇప్పటికే ఆయన పలుమార్లు కోర్టులో పిటిషన్లు వేశారు. కాగా ఈ నేపథ్యంలోనే వరవరరావుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తెలిపింది. అయితే సుప్రీంకోర్టు కేవలం మెడికల్ బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. ఈ కారణంగా వరవరరావు అనేక షరతులను పాటించాల్సి ఉంది. వాటిని ఉల్లంఘిస్తే..   మళ్లీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  వరవరరావు  .. విప్లవ రచయితల సంఘంలో కీలక పాత్ర పోషిస్తారు.. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా గతంలో పలు మార్లు అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేశారు.   అయితే ఏ కేసులోనూ శిక్ష పడలేదు. ఎల్గార్ పరిషత్ కేసులో   లభించిన ఓ ల్యాప్ ట్యాప్‌లో  వరవరరావు పేరు ఉండటంతో  ఆయనను అరెస్ట్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget