By: ABP Desam | Updated at : 14 Dec 2022 01:30 PM (IST)
ఇప్పటం ఇళ్ల యజమానులకు మళ్లీ షాక్
Ippatam House Owners : ఇప్పటంలో కూల్చివేత బాధితులైన ఇళ్ల యజమానులకు ఏపీ హైకోర్టులో మరోసారి షాక్ తగిలిగింది. తమకు విధించిన రూ. లక్ష జరిమానాను తగ్గించాలని వారు దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. తాము ఇళ్లను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే హైకోర్టులో నోటీసులు ఇవ్వలేదని చెప్పామని... మన్నించాలని .. జరిమానా తగ్గించాలని కోరారు. అయితే న్యాయమూర్తి మాత్రం అంగీకరించలేదు. పిటిషన్ ను డిస్మిస్ చేశారు. దీంతో ఇళ్ల యజమానులు రూ. లక్ష జరిమానా కట్టాల్సి ఉంటుంది.
14 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున జరిమానా విధించిన హైకోర్టు
ఇప్పటం గ్రామంలో ఇళ్ల యజమానులైన పధ్నాలుగు మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. లక్షల చొప్పున జరిమానా విధించింది. ఇళ్ల కూల్చివేత జరగుతున్నప్పుడు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించిన ఇళ్ల యజమానులు.. తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కూల్చివేతనలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇచ్చినట్లుగా ప్రభుత్వం ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది. విచారణలో రైతులు.. ఇళ్ల కూల్చివేత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై తమకు అవగాహన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం ప్రకటించారు.
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలని హైకోర్టులో ఇప్పటం గ్రామస్తుల పిటిషన్
ననంబర్ నాలుగో తేదీన ఇప్పటం గ్రామంలో ప్రధాన రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తున్నామని చెప్పి.. ఆ రోడ్డులో ఉన్న 53 ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. అంతకు ముందే వారికి రోడ్డు విస్తరణ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ భూమినే ఆక్రమించుకుని ఉన్న ఇళ్లను తొలగించాలని లేకపోతే కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వాటిపై ముందుగానే న్యాయపోరాటం చేయలేదు ఇళ్ల యజమానులు. నవంబర్ నాలుగో తేదీన ఉదయమే కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత వారిలో కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో తమకు ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అప్పటికప్పుడు హైకోర్టు కూల్చివేతలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణలో వారు హైకోర్టుకు తప్పడు సమాచారం ఇచ్చారని వెల్లడయింది.
ఇచ్చినట్లుగా హైకోర్టు దృష్టికి తీసుకెెళ్లిన ప్రభుత్వం
ఇప్పటం కూల్చివేతల అంశం రాజకీయంగానూ కలకలం రేపింది. జనసేన ప్లీనరీకి అక్కడి రైతులు పొలం ఇచ్చిన కారణంగానే ప్రభు్తవం కక్ష గట్టి కూల్చివేతలకు పాల్పడిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కూల్చివేసిన తర్వాతి రోజే ఇప్పటం గ్రామంలో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత యాభై మూడు కుటుంబాలకు.., కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు.
కోోర్టును తప్పుదోవ పట్టించారని రైతులకు జరిమానా
ప్రభుత్వం మాత్రం ఇళ్ల కూల్చివేతలో ఎలాంటి కక్ష సాధింపు లేదని చెబుతోంది. మార్చిలోనే రోడ్డును ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చామని ప్రకటించింది. గ్రామ అవసరాల కోసమే రోడ్డును విస్తరిస్తున్నామని.. ప్రభుత్వం ఎవరి ఇళ్లనూ కూల్చలేదని స్పష్టం చేసింది. కేవలం ప్రహారి గోడలను మాత్రమే కూల్చామని తెలిపింది. అదే సమయంలో ఈ అంశం రాజకీయంగా దుమారం రేగడంతో.. కూల్చివేసిన ఇళ్ల ముందు.. తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చలేదని.. రాజకీయం చేసి.. తమను ఇబ్బంది పెట్టవద్దన్న పోస్టర్లు వెలిశాయి. దీంతో ఈ అంశం మరింత రాజకీయం అయింది.
హైకోర్టు తీర్పు విషయంలో రైతులు జరిమానా చెల్లిస్తారా.. పైకోర్టుకు వెళ్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
AP BRS : ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంతనాలు!
దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!