News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Lingamaneni Guest House : లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ మెంట్ పై జూన్ రెండో తేదీన తీర్పు - వాదనలు విన్న ఏసీబీ కోర్టు

లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్‌మెంట్‌పై జూన్ రెండో తేదీన ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.

FOLLOW US: 
Share:

Lingamaneni Guest House :   ఉండవల్లి  కరకట్టపై ఉన్న లింగమనేని  గెస్ట్ హౌస్  జప్తు  విషయమై  ఏపీ సీఐడీ  దాఖలు చేసిన  పిటిషన్  పై ఏపీ సీఐడీ  దాఖలు  చేసిన పిటిషన్ ను  విచారించింది. తీర్పును  రెండో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.   లింగమనేని గెస్ట్ హౌస్ లోనే  చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారు. ఇటీవలనే  ఈ గెస్ట్ హౌస్ ను ఏపీ ప్రభుత్వం అటాచ్  చేసింది.  అయితే  ఈ గెస్ట్ హౌస్ ను  జప్తు చేసేందుకు అనుమతివ్వాలని  ఏపీ సీఐడీ   ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది. ఈ పిటిషన్ పై  ఏసీబీ కోర్టు వాదనలను  విన్నది. రాజధాని  భూ సేకరణ నుండి  మినహాయించినందునే లింగమనేని గెస్ట్ హౌస్ నపు  చంద్రబాబుకు కేటాయించారని  ఏపీ సీఐడీ ఆరోపణలు  చేస్తుంది.  ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత  తీర్పును రిజర్వ్  చేసింది. మొదట సాయంత్రం తీర్పును ప్రకటించాలని అనుకున్నారు తర్వాత రెండో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ గెస్ట్  హౌస్  జప్తునకు  ఉత్తర్వులు ఇవ్వాలని  ఏసీబీ కోర్టులో  ఏపీ సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ విషయమై  నోటీసులు  ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని కూడా సీఐడీ వాదించింది. సీఆర్‌డీఏ అలైన్ మెంట్,  మాస్టర్ ప్లాన్ విషయంలో అవకతవకలు  జరిగాయని సీఐడీ  న్యాయవాది పేర్కొన్నారు.  క్విడ్  ప్రో కో లో భాగంగానే  లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబుకు కేటాయించారని  సీఐడీ వాదించింది.  అయితే  ఈ విషయమై  క్విడ్ ప్రో కో జరిగిందని  ఆధారాలను సీఐడీ  అందించలేదని  లింగమనేని రమేష్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.                                

సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.   సీఎంగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ పదవుల దుర్వినియోగానికి, క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలు జరిగాయని, దానికి బదులుగా చంద్రబాబు కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని ప్రభుత్వం అభియోగం మోపింది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను ఉల్లంఘించినట్టు ప్రభుత్వం నిర్థారించింది.                                                

తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని ప్రభుత్వం అభియోగం మోపింది. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి.. ప్రతిఫలంగా గెస్ట్ హౌస్ తీసుకున్నారని ఇది క్విడ్ ప్రో  కో కిందకు వస్తుందని సీఐడీ..కేసు నమోదు చేసి అటాచ్ మెంట్ కోసం ప్రభుత్వానికి లేఖలు రాసింది.ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Published at : 31 May 2023 06:47 PM (IST) Tags: AP Politics Amaravati Lingamaneni Guest House

ఇవి కూడా చూడండి

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

Vadde Sobhanadreeswararao: జగన్ పైశాచికానందం కోసమే బాబుపై సీఐడీ కేసు, ఇక మారకపోతే పతనమే: మాజీ మంత్రి

Vadde Sobhanadreeswararao: జగన్ పైశాచికానందం కోసమే బాబుపై సీఐడీ కేసు, ఇక మారకపోతే పతనమే: మాజీ మంత్రి

టాప్ స్టోరీస్

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?