అన్వేషించండి

TDP Senior Leaders : పలువురు టీడీపీ సీనియర్లకు ఇంకా ఖరారు కాని టిక్కెట్ - త్యాగం చేయడమేనా ?

Andhra Politics : టీడీపీ సీనియర్లకు రెండో జాబితాలోనూ చోటు దక్కలేదు. కొంత మందికి టిక్కెట్ నిరాకరించే అవకాశం కనిపిస్తోంది.

Tdp Second List : టీడీపీ రెండో జాబితాలో సీనియర్లకు షాక్ తగిలింది. 34 మందితో విడుదలైన రెండో జాబితాలో పలువురు సీనియర్లకు సీటు దక్కలేదు. సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కేఎస్ జవహర్ తో పాటు పలువురు సీనియర్ల  పేర్లు రెండో జాబితాలో లేవు. వీరి పోటీపైన గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34మంది టికెట్లు కేటాయించింది టీడీపీ.                                  

గంటా శ్రీనివాసరావును చీపురుపల్లీలో పోటీ చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. అయితే అక్కడ  పోటీ చేయడంపై గంటా వెనుకడుగు వేస్తున్నారు. తనకు భీమిలి నియోజకవర్గం కావాలంటున్నారు. ఈ సీటుపై ఎటూ తేలకపోవడంతో  పెండింగ్ లో పెట్టారు.  మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పివిజి కుమార్ కు నిరాశే ఎదురైంది. అక్కడ పైలా ప్రసాద్ కు చాన్సిచ్చారు.  వైసీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇచ్చింది టీడీపీ. విజయవాడ వెస్ట్ లో జలీల్ ఖాన్ కు టికెట్ దక్కలేదు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ దక్కించుకున్నారు.                                     

రెండో జాబితాల్లోనూ తమకు కచ్చితంగా టికెట్ దక్కుతుందని సీనియర్లు భావించారు. అయితే, వారికి సెకండ్ లిస్టులోనూ నిరాశే ఎదురైంది.   మూడో జాబితాలో అయినా తమకు టికెట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ఇంకా 14 సీట్లను పెండింగ్ లో పెట్టింది. రెండో జాబితాలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించింది టీడీపీ. 35ఏళ్ల లోపు వారిలో ఇద్దరు, 75ఏళ్లు పైబడిన వారిలో ఇద్దరు లిస్టులో ఉన్నారు. టీడీపీ సెకండ్ లిస్ట్ లో పీహెచ్ డీ చేసిన వారు ఒకరు, పీజీ చదువుకున్న వారు 11మంది, 10లోపు చదువుకున్న వారు ఐదుగురు ఉన్నారు. ఇక పొత్తులో భాగంగా గాజువాక టికెట్ టీడీపీకే దక్కింది.  గాజువాక సీటును టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు కేటాయించారు. మరోవైపు రెండో జాబితాలోనూ ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు కనిపించలేదు.               

 గెలుపే ప్రామాణికంగా, సర్వేలు, ప్రజాభిప్రాయసేకరణ, పార్టీ పరంగా అంతర్గతంగా జరిగిన అనేక సర్వేల ఆధారంగానే రెండు జాబితాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగించింది టీడీపీ. రెండు జాబితాల్లోనూ టికెట్ దక్కక తీవ్ర నిరాశలో ఉన్న వ్యక్తుల్లో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహర్ ప్రధానంగా ఉన్నారు.  ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు కూడా టిక్కెట్ ఖారరు చేయలేదు.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Booking Rules: మళ్లీ మారిన సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్.. ఎవరు ఎప్పుడు బుక్ చేయాలో తెలుసా
మళ్లీ మారిన LPG సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్.. ఎవరు ఎప్పుడు బుక్ చేయాలో పూర్తి వివరాలివే
PM Modi Posts Vijayawada Singer Song: ప్రధాని మోదీ మెచ్చిన విజయవాడ సింగర్ గురించి ఈ విషయాలు తెలుసా!
ప్రధాని మోదీ మెచ్చిన విజయవాడ సింగర్ గురించి ఈ విషయాలు తెలుసా!
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Delimitation Politics: నియోజకవర్గాల పునర్విభజన పొలిటికల్ గేమ్ ఛేంజర్ - అధికారపార్టీలకు అడ్వాంటేజ్ అవుతాయా?
నియోజకవర్గాల పునర్విభజన పొలిటికల్ గేమ్ ఛేంజర్ - అధికారపార్టీలకు అడ్వాంటేజ్ అవుతాయా?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Bunks: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద భారీ క్యూ- వదంతులు నమ్మవద్దన్న పోలీసులు!
హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద భారీ క్యూ- వదంతులు నమ్మవద్దన్న పోలీసులు!
Shane Warne: షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Ustaad Bhagat Singh Collections: టాలీవుడ్ 2026 టాప్ 3లోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'... 'ధురంధర్ 2' సునామీలోనూ కలెక్షన్లు... ఆరో రోజు నెట్ ఎంతంటే?
టాలీవుడ్ 2026 టాప్ 3లోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'... 'ధురంధర్ 2' సునామీలోనూ కలెక్షన్లు... ఆరో రోజు నెట్ ఎంతంటే?
Cases against KTR: ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
Embed widget