News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి దుర్మార్గం అని కింజారపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణడు తెలిపారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం ఇదేనంటూ ఫైర్ అయ్యారు. 

FOLLOW US: 
Share:

TDP Leaders on YCP Govt: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే దాడులకు పాల్పడడం అనాగరికం, అప్రజాస్వామికం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ సైకో చర్యలకు సమాధికట్టే రోజు దగ్గరలోనే ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు ఆనం వెంకట రమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ తీరు చూస్తుంటే.. జర్మనీలో నాజీల దురాగతాలను కళ్లకు కడుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరమా అని ఫైర్ అయ్యారు. ఎంతసేపూ ప్రశ్నించిన వారిని వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతుందా అని హైకోర్టు పదే పదే ప్రశ్నించడం చూస్తుంటేనే... రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్తితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జగన్ తాత, తండ్రి వారసత్వ ఫ్యాక్షన్ రాజకీయాలను, దౌర్జ్యన్యాలను, దోపిడి విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రాన్ని నేరగాళ్లకు అడ్డాగా మార్చారన్నారు. జగన్ మోహన్ రెడ్డి సాధిస్తున్న దమనకాండకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందని.. దాడి చేసిన నింధితులను వెంటనే అరెస్ట్ చేసి, ఆనంకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాట్లు వెల్లడించారు. 

టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వివరించారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. పట్ట పగలు ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడం జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులతో మమ్మల్ని భయ పెట్టాలనుకోవడం జగన్ రెడ్డి పగటి కల అన్నారు. తమపై ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడుతామని వివరించారు  ఆనంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై నెల్లూరులో దాడి జరిగింది. నెల్లూరు బీబీనగర్ సమీపంలో టీడీపీ నేత కిలారి వెంకటస్వామి నాయుడు నివాసం వద్ద ఆనం వెంకట రమణారెడ్డి ఉండగా 8 మంది దుండగులు ఆయనపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆనంపై దాడి చేస్తున్న వారిని అక్కడే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు రెండు వాహనాలను అక్కడే వదిలి పారిపోయారు. కర్రలు, మారణాయుధాలతో సహా దుండగులు అపార్ట్ మెంట్ దగ్గరకు వాహనాల్లో వచ్చారని తెలుస్తోంది. అపార్ట్ మెంట్ వాసులంతా కేకలు వేయడంతో దాడి చేయడానికి వచ్చినవారు పారిపోయారు. 

వైసీపీ పనే..!

దాడికి ప్రయత్నించింది వైసీపీ నాయకులేనంటూ ఆరోపణలు వినపడుతున్నాయి. ఆనం వెంకట రమణారెడ్డి టీడీపీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారని, అందుకే ఆయనపై దాడికి పాల్పడ్డారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ నాయకులే వారి అనుచరులతో ఈ పని చేయించారని చెప్పారు. దుండగులు వాడిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. 

Published at : 04 Jun 2023 03:02 PM (IST) Tags: AP Politics Yanamala Ramakrishnudu Anam Venkataramana Reddy Atchhannaidu attack on TDP

ఇవి కూడా చూడండి

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

Vadde Sobhanadreeswararao: జగన్ పైశాచికానందం కోసమే బాబుపై సీఐడీ కేసు, ఇక మారకపోతే పతనమే: మాజీ మంత్రి

Vadde Sobhanadreeswararao: జగన్ పైశాచికానందం కోసమే బాబుపై సీఐడీ కేసు, ఇక మారకపోతే పతనమే: మాజీ మంత్రి

టాప్ స్టోరీస్

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?