అన్వేషించండి

AP Bandh: చంద్రబాబుకు రిమాండ్- ఏపీ బంద్‌కు టీడీపీ‌ పిలుపు

AP Bandh: చంద్రబాబు అరెస్టు, రిమాండుకు నిరసనగా ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపుతో చేసిన అరెస్టును బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరింది.

AP Bandh: చంద్రబాబు అరెస్టు, రిమాండుకు నిరసనగా ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపుతో చేసిన అరెస్టును బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కేందుకే ఇలా చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా అత్యవసర సేవల్లోని వారు మినహా మిగతా వర్గాలన్నీ బంద్కు సహకరించాలని నేతల కోరారు. 

పలు చోట్ల రోడ్లపైకి టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల నిరసనలు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మసీద్ సెంటర్లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కందుకూరులోని పామూరురోడ్డు జంక్షన్‌లో టీడీపీ శ్రేణులు మానవహారంగా నిలబడి ఆందోళన చేపట్టాయి. సీఎం డౌన్ డౌన్, సైకో దిగిపోవాలి, చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నేతలు ఆందోళనలు చేపట్టారు.

చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఐడీ వాదనలతోనే కోర్టు ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 2 వారాల రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. 

జిల్లా ఎస్పీలకు కీలక ఆదేశాలు
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

మరికాసేపట్లో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. లేక రాత్రి సిట్ ఆఫీసుకు తరలించి, రేపు ఉదయం రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం సైతం ఉంది. అయితే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఏపీ సిఐడి వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. గవర్నర్ అనుమతితో అరెస్ట్ చేయాలన్న వాదనలను సైతం కోర్టు కొట్టిపారేసింది. 

అంతకుముందు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో నేటి ఉదయం నుంచి దాదాపు ఏడున్నర గంటలకు పైగా ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే అరెస్ట్ జరిగిందని, ఈ కేసులో 409 సెక్షన్‌ పెట్టడం సరికాదన్నారు. ఒకవేళ ఆ సెక్షన్‌ పెట్టాలంటే సరైన సాక్ష్యం చూపాలని ఏసీబీ కోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. 

టాప్ హెడ్ లైన్స్

NFIR Marri Raghavaiah: రైల్వే కార్మికుల హక్కుల కోసం ఎన్ఎఫ్ఐఆర్ పోరాటం - పాత పెన్షన్, 8వ వేతన సంఘం, భద్రతా పోస్టులు !
రైల్వే కార్మికుల హక్కుల కోసం ఎన్ఎఫ్ఐఆర్ పోరాటం - పాత పెన్షన్, 8వ వేతన సంఘం, భద్రతా పోస్టులు !
Tirumala 121 kg Gold Donation: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పణ.. రూ.206 కోట్ల భారీ విరాళంపై సీఎం చంద్రబాబు హర్షం!
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పణ.. రూ.206 కోట్ల భారీ విరాళంపై సీఎం చంద్రబాబు హర్షం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
PRP Vijaysai Reddy: వైఎస్ కుటుంబ ఆస్తుల గుట్టు నాకు, కేవీపీకే తెలుసు.. కోర్టు పిలిస్తే అన్నీ చెబుతా - విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ కుటుంబ ఆస్తుల గుట్టు నాకు, కేవీపీకే తెలుసు.. కోర్టు పిలిస్తే అన్నీ చెబుతా - విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
YS Sharmila vs K Kavitha: ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Embed widget