TDP JanaSena fight over sand scam : ఏపీలో ఇసుక స్కాంపై టీడీపీ, జనసేన ఆందోళనలు - రూ. 50వేల కోట్లు దోచేశారని శనివారం ధర్నాలు !
sand scam : ఇసుక స్కాంపై టీడీపీ, జనసేన శనివారం అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించనున్నాయి. ఇసుక రీచ్‌ల వద్ద సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నారు.
TDP and Jana Sena fight over sand scam : రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక దోపిడిపై రేపు టీడీపీ, జనసేన ఆందోళనలు చేయనున్నాయి. టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసి ఇసుక మాఫియాతో జగన్ రెడ్డి 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు లూఠీ చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏ ఇసుక దోపిడిపై రేపు టీడీపీ, జనసేన ఆందోళనలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసి ఇసుక మాఫియాతో జగన్ రెడ్డి 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు లూఠీ చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని అక్రమ తవ్వకాల ఫోటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు, తదితర ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్), ఎన్జీటి నిర్దారించాయని తెలిపారు. అయినా జగన్ రెడ్డి ఇసుక దోపిడి మాత్రం ఆపటం లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల కనుసన్నల్లో 500 కి పైగా రీచ్ ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమ ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఆందోళనలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన శ్రేణులు రీచ్ ల వద్ద నిరసనలు తెలపటంతో పాటు వైసీపీ అక్రమ ఇసుక దోపిడిని ఫోటోలు, సెల్పీల రూపంలో ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. ఇసుక తవ్వకాలపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఎలాంటి అనుమతులు లేకుండా 24 గంటలూ తవ్వకాలు చేపడుతున్నారని.. ఒక్కో రీచ్‌లో రోజుకు 2 వేల టన్నుల మేర తవ్వకాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా తవ్వకాల ఆధారాలు సేకరించామని వివరించింది. ఎలాంటి ఈసీలు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని తెలిపింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదని పేర్కొంది.
విచారణ సందర్భంగా ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో కలెక్టర్ల నివేదిక, కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విచారణ జరుగుతోందని.. ఏం చేయాలనేది న్యాయస్థానమే తేలుస్తుందని స్పష్టం చేసింది. నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపింది. దోపిడి నిజమని తేలడంతో.. టీడీపీ, జనసేన ప్రభుత్వానికి వ్యతిరంగా నిరసనలు ప్రారంభించాయి.