అన్వేషించండి

Andhra News : పుట్టినరోజు వేడుకల పేరుతో 100 కోట్లు లూఠీ - సీఎం జగన్‌పై టీడీపీ ఆగ్రహం !

Jagan birthday : పుట్టిన రోజు వేడుకల పేరుతో ప్రజాధనం వంద కోట్లు లూఠీ చేశారని టీడీపీ ఆరోపించింది. రాచరిక పోకడులకు పోతున్నారని మండిపడింది.


Andhra News CM Jagan Birthday :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రాచరిక పోకడలతో బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శించారు.  ముఖ్యమంత్రిగా చివరి పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుద లచేశారు. బర్త్ డే పేరుతో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాకు ప్రకటనల రూపంలో రూ.100 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడం జగన్ రెడ్డి పెత్తందారీ పోకడలను తెలియజేస్తోంది అని మండిపడ్డారు. నెలకు ఒక్క రూపాయే గౌరవ వేతనం తీసుకుంటానని గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి ...పుట్టినరోజు పేరుతో కోట్లు ఖర్చు చేయడం ఆయన రాచరిక పోకడలకు అద్దం పడుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, సొంత పత్రికకి ప్రకటన ఇవ్వడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉపయోగకరమైన పనులు చేయడంపై ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమన్నారు. జీతాలు పెంచమని అంగన్వాడీలు ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తుంటే కనీసం స్పందించని ముఖ్యమంత్రి తన పుట్టినరోజు కోసం కోట్ల రూపాయిలు వృథా చేయడం దేనికి సంకేతం? అంటూ నిలదీశారు. పైగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను విద్యార్థులే స్వయంగా తయారు చేసి ప్రదర్శించాలని ఆదేశాలివ్వడం సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. పన్నుల బాదుడు, చార్జీల మోత, నిత్యావసరాల పెంపుతో పేద, మధ్యతరగతి నడ్డి విరిచారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఇన్ని వైఫల్యాలు కళ్ల ముందు కనిపిస్తుంటే గ్రాండ్ బర్త్ డే ఎలా చేసుకోవాలపించిందో జగన్ రెడ్డికే తెలియాలి అని అచ్చెన్నాయుడు నిలదీశారు.

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా ఇలాగే  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.   సీఎం హోదాలో మీకు ఇదే చివరి  బర్త్ డే అవుతుంది. ఎందుకంటే మీరు మూడు నాలుగు నెలల్లో మాజీ సీఎం అవ్వబోతున్నారని జోస్యం చెప్పారు.  ఈ విషయం మీకూ పూర్తిగా అర్ధం అయినట్లు ఉంది. అందుకే ఒక్కరోజులో మీ పుట్టినరోజు ప్రకటనల పేరుతో సొంత పత్రిక కోసం రూ.100 కోట్లు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల నుంచి కోట్లు కుమ్మరించి శుభాకాంక్షలకు ప్రకటనలా? ప్రైవేటు సంస్థలను బెదిరించి మరీ యాడ్స్ పేరుతో వసూలు చేస్తారా? పుట్టిన రోజు నాడూ అబద్ధాలు చెప్పడమే మీ నైజమా? అని ప్రశ్నించాు. పుట్ిటన రోజు  ఒక్క రోజులో 100 కోట్లు కొట్టేసిన ఏకైక CM మీరే. పుట్టిన రోజును సైతం ఆర్థిక ఉగ్రవాదానికి వేదికగా చేసుకుంటారు కాబట్టే.. ముఖ్యమంత్రి గా మీకు ఇది చివరి పుట్టిన రోజు అవుతుంది. అక్రమ పద్దతిలో, అధికారిక దోపిడీలో మీకు మీరే సాటి. రాష్ట్రం మాత్రం లూటీ అని మండిపడ్డారు. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABPEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPBJP MP Candidate Madhavilatha | పదవులు వచ్చినా..రాకపోయినా... పాతబస్తీలోనే ఉంటానంటున్న మాధవిలతNagababau on Pithapuram | గీతకు కాల్ చేసిన కడప వ్యక్తి..వార్నింగ్ ఇచ్చిన నాగబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Telangana Lok Sabha Elections : అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
IPL 2024: గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
Embed widget